మహేష్‌బాబుపై రూమర్లు.. ఖండించిన సన్నిహిత వర్గాలు
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు కొత్త వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నారనే వార్త మీడియాలో వైరల్‌గా మారింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీ ఫ్లాట్‌ఫాం బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ కొద్దిరోజలుగా వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ఏఎంబీ సినిమాస్ బిజినెస్‌లోకి ప్రవేశించిన ఆయన తన వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు అని వార్త కథనాలు వెలువడ్డాయి. అయితే దేశవ్యాప్తంగా వెబ్ సిరీస్ నిర్మాణం చేయనున్నారని, అందుకు సోని పిక్చర్స్‌తో భాగమవుతున్నారు అని పేర్కొన్నారు.

అయితే అలాంటి బిజినెస్‌లోకి వస్తున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదు అని మహేష్ బాబు పీఆర్ వర్గాలు వెల్లడించాయి. అలాంటి వార్తలన్నీ ఊహజనీతమే. అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు.
ఇక మహేష్ విషయానికి వస్తే... ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు తర్వాత గీతా గోవిందం దర్శకుడు పరుశరాంతో సినిమాను రూపొందించే విషయంపై దృష్టిపెట్టారు.


Click it and Unblock the Notifications











