ఈడీ ముందుకు మహేష్ బాబు.. మనీలాండరింగ్ కేసులో విచారణకు సూపర్‌స్టార్
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా షూటింగుతో బిజీగా ఉన్న సూపర్‌స్టార్ మహేష్ బాబు మనీలాండరింగ్ ఆరోపణల కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) ముందు హాజరుకానున్నారు. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ఆర్థిక వ్యవహారాల్లో అవకతకవలను గురించిన ఈడీ అధికారులు గత నెల మహేష్ బాబుకు నోటీసులు జారీ చేశారు. తన అకౌంట్‌లోకి వచ్చిన కోట్ల రూపాయలపై వివరణ ఇవ్వాలని వారు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే గతంలో తాను ఈడీ విచారణకు వెంటనే హాజరుకాలేనని లేఖ రాయడం, వారు కొత్తగా మరే డేట్‌ను ఇవ్వడంతో ఆయన తప్పనసరిగా విచారణకు హాజరకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేసు విచారణకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఏపీ, తెలంగాణలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు సాయి సూర్య, సురానా గ్రూప్‌పై ఈడీ అధికారులు ఏప్రిల్ 16వ తేదీన సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో వారి కంపెనీ అకౌంట్లలో అనేక సందేహాస్పద అంశాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో మహేష్ బాబుకు చెల్లించిన కొన్ని కోట్ల రూపాయలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దాంతో మహేష్ బాబు పేరు బయటకు వచ్చింది.

ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ కంపెనీలు ఆర్థిక వ్యవహారాల్లో భారీగా అవకతవకలు ఉన్నాయనే విషయాన్ని ఈడీ గుర్తించింది. ఈ క్రమంలోనే వారు చేసిన చెల్లింపుల్లో మహేష్ బాబుకు ఇచ్చిన కొట్ల రూపాయలపై అనేక అనుమానాలు ఉండటంతో ఆయనను విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.
సాయి సూర్య, సురానా కంపెనీలకు మహేష్ బాబు బ్రాండబ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఈ మేరకు ఆయనకు రెమ్యునరేషన్‌గా సుమారుగా 5.9 కోట్ల రూపాయలు చెల్లించారు. అందులో 3.4 కోట్ల రూపాయలు చెక్కు రూపంలో, 2.5 కోట్ల రూపాయలు నగదు రూపంలో చెల్లించారు. ఈ చెల్లింపు మొత్తాలపై క్లారిటీ లేకపోవడం వల్ల మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
అయితే ఈ విషయంలో మనీలాండరింగ్ జరిగిందా? మహేష్ బాబుకు నగదు ఎలా చేరింది? అనే విషయాలపై దృష్టిపెట్టి విచారణకు హాజరుకావాలని కోరింది. అయితే తనకు ముందస్తు కార్యక్రమాలు, షూటింగులు ఉండటం వల్ల నేను విచారణకు హాజరుకాలేను అని లేఖ రాశారు. దాంతో ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని మే 12వ తేదీన హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.
ఇటీవల జారీ చేసిన నోటీసుల ప్రకారం సోమవారం అంటే మే 12వ తేదీన ఈడీ అధికారుల ముందు మహేష్ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే ఈ విచారణకు హాజరవుతారా? లేదా మరో డేట్‌ను అభ్యర్థిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వార్తకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ వివరాల కోసం ఫిల్మీబీట్ అప్‌డేట్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











