షాకింగ్: త్రివిక్రమ్ కథను మహేశ్ వినలేదా.. క్రేజీ ప్రాజెక్టు నుంచి లేటెస్ట్ న్యూస్

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న బడా హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. పేరుకు బడా బ్యాగ్రౌండ్‌తో హీరోగా పరిచయం అయినప్పటికీ.. కెరీర్ ఆరంభంలోనే వరుస హిట్లతో తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలోనైతే ఏకంగా అతడు 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకుని.. కెరీర్‌లోనే ఎన్నడూ లేనంత ఫామ్‌తో కనిపిస్తున్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు 'సర్కారు వారి పాట' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ భారీ కలెక్షన్లను రాబట్టింది.

వాస్తవానికి 'సర్కారు వారి పాట' షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళితో భారీ ప్రాజెక్టును ప్రకటించాడు. అయితే, ఇది ప్రారంభం అవడానికి చాలా సమయం ఉండడంతో దీని కంటే ముందు మరో సినిమాను చేయాలని ఈ స్టార్ హీరో డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగానే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమాను ప్రకటించాడు. 'అతడు', 'ఖలేజా' వంటి సినిమాల తర్వాత రాబోతున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై ఆరంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా ఈ మూవీ మొదట్లోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఎన్నో వార్తలు లీక్ అవుతున్నాయి.

Mahesh Babu to Hear Trivikram Srinivas Final Script

సుదీర్ఘ కాలం తర్వాత మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోయే ఈ సినిమా కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన ఎప్పుడో వచ్చినప్పటికీ.. ఈ మూవీ పూజా కార్యక్రమాలు మాత్రం కొద్ది రోజుల క్రితమే జరిగాయి. కానీ, ఇప్పటి వరకూ ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మాత్రం మొదలు కాలేదు. అయితే, ఈ మూవీ షూట్ జూన్ చివరి వారంలో కానీ, జూలై మొదటి వారంలో కానీ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రతిష్టాత్మక చిత్రం నుంచి మరో ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.

విస్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు సంబంధించిన కథను సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పటి వరకూ వినలేదట. గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కేవలం ఒక లైన్‌ మాత్రమే వినిపించాడట. దీనికి ఇంప్రెస్ అయిన ఈ స్టార్ హీరో వెంటనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక, ఇప్పుడు ఈ సినిమా పూర్తి స్థాయి స్క్రిప్టును మహేశ్ బాబుకు త్రివిక్రమ్ వినిపించబోతున్నాడట. ఈ వారంలోనే వీళ్లిద్దరూ కలవబోతున్నారని తెలుస్తోంది. దీనిపై మహేశ్ సంతృప్తిగా ఉంటే వెంటనే రెగ్యూలర్ షూటింగ్‌ను కూడా మొదలు పెడతారట. లేకుంటే ఇది కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో హీరో రా ఏజెంట్‌గా కనిపిస్తాడని అంటున్నారు. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక, ఈ మూవీకి 'పార్థు', 'అతడే పార్థు', 'అర్జునుడు' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి థమన్ సంగీతం అందించబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X