Just In
- 4 hrs ago
బండ్ల గణేష్‌కు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చేరిన స్టార్ ప్రొడ్యూసర్
- 4 hrs ago
Vakeel Saab Day 5 collections.. చరిత్ర సృష్టించిన పవన్ కల్యాణ్.. లాక్డౌన్ తర్వాత అరుదైన రికార్డు
- 5 hrs ago
ఏక్ లవ్ యా అంటూ నిర్మాతగా మారిన పూరీ జగన్నాథ్ హీరోయిన్.. సొంత తమ్ముడే హీరోగా
- 5 hrs ago
ఐదు భాషల్లో ఆర్జీవి ‘దెయ్యం’.. ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు.. రిలీజ్ ఎందుకు లేట్ అయిందంటే..
Don't Miss!
- News
గూర్ఖాలూ ఆందోళన వద్దు! మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం: అమిత్ షా
- Sports
KKR vs MI:గెలిచే మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా.. ముంబై ఇండియన్స్ బోణీ!
- Finance
సెన్సెక్స్ 660 పాయింట్లు జంప్, మార్కెట్ అదరగొట్టడం వెనుక...
- Automobiles
డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్
- Lifestyle
Sun Transit in Aries on 14 April:మేషంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశుల వారికి ప్రత్యేకం...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నాగ చైతన్యకు సహాయం చేస్తున్న మహేశ్ బాబు: ‘లవ్ స్టోరీ’ నుంచి మరో అదిరిపోయే అప్‌డేట్
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య.. టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం 'లవ్ స్టోరీ'. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చి ఘన విజయాన్ని అందుకున్న 'ఫిదా' తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న మూవీ ఇది. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇప్పటి వరకూ వచ్చిన అన్ని పాటలు, టీజర్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే దీని నుంచి మరో పాటను విడుదల చేయబోతున్నారు. తాజాగా దానికి సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించింది.
'లవ్ స్టోరీ' విడుదల తేదీకి సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మరింత ముమ్మరం చేసేసింది. ఇందులో భాగంగానే ఈ మూవీ నుంచి 'ఏవో ఏవో కలలే' అనే సాంగ్‌ను మార్చి 25న విడుదల చేయబోతున్నారు. అంటే గురువారం ఉదయం 10:08 గంటలకు ఈ పాట సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను కొద్ది సేపటి క్రితమే విడుదల చేసింది. ఈ పాట అదిరిపోయే డ్యాన్స్ నెంబర్‌తో సాగుతుందని తెలుస్తోంది. ఇందులో చైతూ.. సాయి పల్లవి పోటాపోటీగా డ్యాన్స్ చేశారని టాక్.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'లవ్ స్టోరీ' మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. ఈ సినిమా అంచనాలకు తగ్గట్లుగానే భారీగా ప్రీ బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అన్నీ ఏరియాలో రైట్స్‌తో పాటు శాటిలైట్ ప్లస్ డిజిటల్ హక్కులకు రూ. 30 కోట్లకు పైగానే వ్యాపారం జరిగినట్లు తెలిసింది. ఇక, ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.