‘శ్రీకారం’ చుట్టబోతున్న మహేశ్ బాబు: టాలెంటెడ్ హీరో కోసం ముందుకొచ్చిన స్టార్

స్వయంకృషితో సినీ రంగంలోకి ప్రవేశించిన హీరోల్లో శర్వానంద్ ఒకడు. చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకునే స్థాయి నుంచి స్టార్ హీరోగా ఎదిగాడు. కెరీర్ పరంగా పరాజయాలను ఎదుర్కొన్నప్పటికీ అద్భుతమైన నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. సినిమా సినిమాకు వైవిధ్యాన్ని చూపిస్తోన్న ఈ టాలెంటెడ్ హీరో వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం 'శ్రీకారం' అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ టీజర్‌ రేపు రిలీజ్ కాబోతుంది.

కిశోర్ రెడ్డి అనే నూతన దర్శకుడితో శర్వానంద్ చేస్తున్న చిత్రమే 'శ్రీకారం'. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట దీన్ని నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫిబ్రవరి 9 మంగళవారం సాయంత్రం 4.05 గంటలకు ఈ మూవీ టీజర్ విడుదల కాబోతుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అంతేకాదు, దీన్ని సూపర్ స్టార్ మహేశ్ బాబు లాంచ్ చేయబోతున్నాడు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలు అలరించాయి.

Mahesh Babu to Release Sharwanands Sreekaram Teaser

పక్కా పల్లెటూరి నేపథ్యంతో రాబోతున్న ఈ సినిమా వ్యవసాయం ఆధారంగా సాగుతుందని ఎప్పటి నుంచో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అలాగే, ఇందులో శర్వానంద్ యువ రైతులా కనిపించనున్నాడని తెలుస్తోంది. 1996లో అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన 'రాముడొచ్చాడు' సినిమాలోలా ఇందులోనూ శర్వా హైటెక్ వ్యవసాయం చేస్తాడని అంటున్నారు. అలాగే, మహేశ్ బాబు నటించిన 'మహర్షి' సినిమాను మించిన కంటెంట్‌ను టచ్ చేయబోతున్నారని కూడా ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకూ వచ్చిన పోస్టర్లు దీనికి బలం చేకూర్చుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X