Guntur karam: ఊహించని లుక్‌లో మహేశ్.. ఆ సెంటిమెంట్ ప్రకారం మూవీ హిట్టే

Super star Mahesh babu: తెలుగు చిత్ర పరిశ్రమలో కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ తన రేంజ్‌ను అంతకంతకూ పెంచుకుంటూ వెళ్తోన్న హీరోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆ మధ్యన వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టిన అతడు.. గత చిత్రంతో నిరాశనే ఎదుర్కొన్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా గట్టి సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న కసితో 'గుంటూరు కారం' అనే మూవీని చేస్తున్నాడు.

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న చిత్రమే 'గుంటూరు కారం'. 'అతడు', 'ఖలేజా' వంటి క్లాసిక్ మూవీల తర్వాత వీళ్ల కాంబోలో రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, మధ్యలో కొన్ని అనుకోని అవాంతరాలు ఏర్పడడంతో షూటింగ్‌కు బ్రేకులు వచ్చాయి.

 Mahesh Babu Traditional Look Highlight In Guntur karam Movie

ఎన్నో ఆటంకాల తర్వాత 'గుంటూరు కారం' మూవీకి సంబంధించిన షూటింగ్ గత నెలలోనే పున: ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఏమాత్రం గ్యాప్ లేకుండా ఈ మూవీ షూటింగ్‌ను జరుపుతున్నారు. మిగిలిన టాకీ పార్టును కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేసి మహేశ్ బాబు సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ పట్టుదలగా కనిపిస్తోంది.

 Mahesh Babu Traditional Look Highlight In Guntur karam Movie

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'గుంటూరు కారం' మూవీకి సంబంధించి ఎన్నో రకాల అంశాలు లీక్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి కీలకమైన అంశం బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఇందులో ఓ సందర్భంలో మహేశ్ బాబు తెల్ల పంచె, తెల్ల చొక్కాతో ట్రేడీషనల్ లుక్‌లో కనిపిస్తాడట. ఈ ఎపిసోడ్ మాత్రం హైలైట్‌గా ఉంటుందని తెలిసింది.

ఇక, 'గుంటూరు కారం' మూవీలో మహేశ్ బాబు పట్టు వస్త్రాలతో కనిపించబోతున్నాడని తెలిసినప్పటి నుంచి దీనిపై ఎన్నో రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అతడు అలా కనిపించిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయని, ఆ సెంటిమెంట్ ప్రకారం గుంటూరు కారం కూడా ఘన విజయాన్ని సొంతం చేసుకుంటుందని కొందరు చెబుతున్నారు.

 Mahesh Babu Traditional Look Highlight In Guntur karam Movie

ఇదిలా ఉండగా, 'గుంటూరు కారం' సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లుగా చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ సహా ఎంతో మంది నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న విడుదల అవనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X