SSMB 28 ఆరంభం.. హై యాక్షన్ ఎపిసోడ్ తో మొదలైన మహేష్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్.. వీడియో వైరల్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న మూడవ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. SSMB 28వ ప్రాజెక్టుగా సెట్స్ పైకి వచ్చిన ఈ ప్రాజెక్ట్ తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంతో ఉన్నారు. ఇక మొత్తానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అయితే నేడు గ్రాండ్ గా మొదలుపెట్టారు.

అసలైతే రెండు వారాల క్రితమే ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సింది. కానీ వివిధ రకాల ప్రణాళికలతో త్రివిక్రమ్ టీమ్ ఈ షూటింగ్ పనులను కాస్త ఆలస్యంగానే మొదలుపెట్టింది. ఇక ఏదేమైనా కూడా ఇప్పుడు మొదలుపెట్టిన తర్వాత పెద్దగా గ్యాప్ ఇవ్వకుండా ఈ ఏడాది చివరిలోపు షూటింగ్ పనులు అన్నిటిని కూడా పూర్తి చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇక సినిమా ఆరంభంకు సంబంధించిన స్పెషల్ వీడియోను కూడా కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు.

Mahesh babu trivikram big budget movie shooting begins special video viral

అందులో మహేష్ బాబు సరికొత్త లుక్కుతో కనిపిస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా మహేష్ బాబును ఈ సినిమాల్లో త్రివిక్రమ్ సరికొత్తగా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా చాలా యంగ్ లుక్ తో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ ఎలెమెంట్స్ తో పాటు మంచి ఎమోషనల్ కంటెంట్ ఉన్న ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది అని ఇదివరకే ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వైరల్ గా మారిపోయింది.

ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్లానింగ్ లో అయితే మొదట యాక్షన్ కు సంబంధించిన భారీ ఎపిసోడ్ ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. ఇక ఈ ఏడాది చివరిలోపు సినిమా షూటింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసుకుని ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. ఫైనల్ గా సినిమాను 2023 ఏప్రిల్ 28వ తేదీన థియేటర్లలోకి తీసుకురావాలి అని అఫీషియల్ గా క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా తమన్ మ్యూజిక్ అందించబోతున్నాడు.తారాగణం, సిబ్బంది వివరాలు:

నటీనటులు: సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే
త్రివిక్రమ్: రచన & దర్శకత్వం
సంగీతం: థమన్ ఎస్
సినిమాటోగ్రఫీ: పిఎస్ వినోద్
ఎడిటర్: నవీన్నూ లి
ఆర్ట్ డైరెక్టర్ - ఎ.ఎస్. ప్రకాష్
యాక్షన్ డైరెక్టర్స్: అన్బరివ్
నిర్మాత: ఎస్. రాధా కృష్ణ(చినబాబు)
బ్యానర్ - హారిక & హాసిని క్రియేషన్స్
పిఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X