Guntur Karam: 'పుష్ప 2' రికార్డ్ బ్రేక్ చేసిన మహేశ్ 'గుంటూరు కారం'.. ట్రెండింగ్‌లో వీడియో
స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి సూపర్ స్టార్ గా ఎదిగాడు మహేశ్ బాబు. సర్కారు వారి పాట మూవీతో హిట్ అందుకున్న మహేశ్ తర్వాత ఇంకో సినిమా చేయలేదు. ప్రస్తతం జక్కన్నతో SSMB29, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో SSMB28 సినిమాలు చేస్తున్నాడు ఈ హీరో. తాజాగా SSMB28కు గుంటూరు కారం అనే టైటిల్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మాస్ స్ట్రైక్ పేరుతో విడుదల చేసిన ఈ టైటిల్ అనౌన్స్ వీడియో రికార్డులు కొల్లగొడుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ కాంబినేషన్ గా తెరపైకి రాబోతున్న మహేశ్ బాబు-త్రివిక్రమ్ SSMB28. మహేశ్ బాబుతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేస్తున్న ఈ మూడో సినిమాకు 'అర్జునుడు', 'అతడే పార్థు', 'అమరావతికి అటూ ఇటూ' టైటిళ్లు పరిశీలించి చివరిగా 'గుంటూరు కారం'గా ఫిక్స్ చేశారు. ఇటీవల 2024 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుపుతూ రిలీజ్ చేసిన మహేశ్ బాబు పోస్టర్ కు క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మాస్ స్ట్రైక్ పేరుతో గుంటూరు కారం ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ను వదిలారు మేకర్స్. సూపర్ స్టార్ కృష్ణ జయింతి సందర్భంగా మోసగాళ్లకు మోసగాడు చిత్ర ప్రదర్శనలో భాగంగా హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో ఈ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో మహేశ్ బాబు ఊర మాస్ గెటప్పులో ఆకట్టున్నాడు. మాస్ లుక్స్, స్టైల్, స్వాగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ తో అభిమానులకు సూపర్ ట్రీట్ అందించారు. అంతేకాకుండా బీడీ త్రీడీలో కనిపిస్తోందా అని మహేశ్ చెప్పిన డైలాగ్ విపరీతంగా పేలింది. దీంతో ఈ వీడియో రికార్డ్ క్రియేట్ చేస్తోంది.
గుంటూరు కారం గ్లింప్ల్ వీడియో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఈ మాస్ స్ట్రైక్ వీడియో 24 గంటల్లో 25 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ సాధించింది. అలాగే 3.5 లక్షల లైక్స్ తో యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. అయితే గుంటూరు కారం టీజర్ పుష్ప 2 టీజర్ రికార్డ్ ను బ్రేక్ చేసింది. పుష్ప 2 టీజర్ 24 గంటల్లో తెలుగు వెర్షన్ ఓవరాల్ గా 20.45 మిలియన్ వ్యూస్ సాధిస్తే గుంటూరు కారం అదే 24 గంటల్లో 25 మిలియన్ వ్యూస్ సాధించి మరో రికార్డ్ క్రియేట్ చేసింది.


Click it and Unblock the Notifications











