SSMB28 క్రేజీ అప్డేట్.. రిలీజ్ డేట్ ప్రకటన.. అలాంటి లుక్ తో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ కు పండగే!

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టిన మహేశ్ బాబు అనతి కాలంలోనే అశేష అభిమాన గనాన్ని సంపాదించుకున్నాడు. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ సుధీర్ఘ కాలంగా సత్తా చాటుతున్నాడు. ఇక అందగాడు అనే పదానికి పర్ఫెక్ట్ నిర్వచనంగా అమ్మాయిల్లో మనసుల్లో గూడు కట్టుకుని సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబు నుంచి వచ్చే సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా మహేశ్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు SSMB28 మూవీ మేకర్స్. ఈ సినిమా విడుదల తేదీని పోస్టర్ ద్వారా ప్రకటించారు.

 వరుస హిట్స్ తో..

వరుస హిట్స్ తో..

బాల నటుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఒక్కడు, పోకిరి, దూకుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో సత్తా చాటిన మహేశ్ బాబు ఇటీవలి కాలంలో 'భరత్ అనే నేను' నుంచి వరుసగా 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి భారీ హిట్లు తన ఖాతాలో వేసుకుని హవాను చూపించాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాయి. అయితే, గతేడాది విడుదలైన 'సర్కారు వారి పాట' మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేదు.

ఇద్దరు హీరోయిన్స్..

ఇద్దరు హీరోయిన్స్..

హిట్లు ఫ్లాపులంటూ తేడా చూడకుండా సినిమాలు చేస్తోన్న మహేశ్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అడ్వెంచర్ సినిమాతో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్, సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డేతో పాటు తన డ్యాన్స్ తో మెస్మరైజ్ చేస్తున్న శ్రీలీల కూడా ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది.

హాట్ టాపిక్ గా సినిమా..

హాట్ టాపిక్ గా సినిమా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ కాంబినేషన్ గా తెరపైకి రాబోతున్న మహేశ్ బాబు SSMB28 సినిమాలో మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మహేశ్ బాబుతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేస్తున్న మూడో సినిమా కావడంతో అటు ప్రేక్షకుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ కూడా ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమాకు 'అర్జునుడు', 'అతడే పార్థు', 'అమరావతికి అటూ ఇటూ' వంటి టైటిళ్లు పరిశీలిస్తున్నారు.

గుంటూరు కారం టైటిల్..

గుంటూరు కారం టైటిల్..

ఇక ఆ మధ్య SSMB28 సినిమాను ఆగస్టు 11న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ అదే రోజున మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో మహేశ్ బాబు SSMB28 సినిమాపై సందిగ్ధత ఏర్పడింది. దీంతో మరి మహేశ్ బాబు సినిమా ఎప్పుడు వస్తుందని అభిమానులు ఆరా తీశారు. అంతేకాకుండా మహేశ్ బాబు SSMB28 సినిమాకు 'గుంటూరు కారం' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేయాలని ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా నిర్మాత నాగవంశీని కోరారు.

తిట్టకండి.. అదిరిపోద్ది..

తిట్టకండి.. అదిరిపోద్ది..

అభిమానుల కోరిక మేరకు నాగవంశీ స్పందించారు. "మీరు ఇంక మమ్మల్ని పరిహాసం చేయడం ఆపేయచ్చు. మీ ఆర్తనాదాలు మాకు స్పష్టంగా వినిపించాయి. మిమ్మల్ని ఆనందోత్సహాల్లో తేల్చే భారీ అప్డేట్ సాయంత్రం వచ్చేస్తుంది" అని ట్వీట్ చేశారు. తర్వాత ఐదు గంటలకు ఒక్క అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ నుంచి టార్చర్ మొదలైంది. దీంతో "తిట్టకండి. 6 గంటల తర్వాత మంచి టైమ్ అన్నమాట. నన్ను నమ్మండి. మీకు పండుగ స్టార్ట్ అవుతుంది" అని నాగవంశీ తెలిపారు.

చేతిలో సిగరెట్ తో..

నాగవంశీ చెప్పినట్లుగానే SSMB28 నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న 2024న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. అంతేకాకుండా మహేశ్ బాబు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో మహేశ్ బాబు చేతిలో సిగరెట్ తో మాసీ లుక్ లో అదిరిపోయాడు. సిగరెట్ కాలుస్తూ మహేశ్ నడుచుకుంటూ వచ్చే తీరు ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X