SSMB28: ఆగిపోయిన మహేశ్ బాబు సినిమా.. మారిన రిలీజ్ డేట్, సరికొత్త కథతో ప్లాన్!
సూపర్ స్టార్ క్రిష్ణ వారసుడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టిన మహేశ్ బాబు అనతి కాలంలోనే అశేష అభిమాన గనాన్ని సంపాదించుకున్నాడు. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ సుధీర్ఘ కాలంగా సత్తా చాటుతున్నాడు. ఇక అందగాడు అనే పదానికి పర్ఫెక్ట్ నిర్వచనంగా అమ్మాయిల్లో మనసుల్లో గూడు కట్టుకుని సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబు నుంచి వచ్చే సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఇటీవల సర్కారు పాట సినిమాతో అలరించిన మహేశ్ బాబు మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడన్న వార్తతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. కానీ SSMB28 సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మాత్రం వాళ్లకు నిరాశనే మిగులుస్తుంది.

బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి..
బాల నటుడిగా సినిమాల్లో ప్రవేశించి సూపర్ స్టార్ గా ఎదిగాడు మహేశ్ బాబు. అనేక చిత్రాలతో అలరించిన మహేశ్ బాబు ఇటీవలి కాలంలో 'భరత్ అనే నేను' నుంచి వరుసగా 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి భారీ హిట్లు తన ఖాతాలో వేసుకుని హవాను చూపించాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాయి. అయితే, గతేడాది విడుదలైన 'సర్కారు వారి పాట' మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేదు. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా మహేశ్ బాబు దూసుకుపోతున్నాడు.

పూజాతో పాటు శ్రీలీల..
హిట్లు ఫ్లాపులను చూడకుండా సినిమాలు చేస్తోన్న మహేశ్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అడ్వెంచర్ సినిమాతో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. బుట్ట బొమ్మ పూజా హెగ్డేతో పాటు తన డ్యాన్స్ తో మెస్మరైజ్ చేస్తున్న శ్రీలీల కూడా ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ మూవీపై అంచనాలున్నాయి.

హాట్ టాపిక్ గా..
టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ కాంబినేషన్ గా తెరపైకి రాబోతున్న మహేశ్ బాబు SSMB28 సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. మహేశ్ బాబుతో చేస్తున్న మూడో సినిమా కావడంతో అటు ప్రేక్షకుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ కూడా ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇటీవల ఈ సినిమా చిత్రీకరణను జనవరి 18 నుంచి పునః ప్రారంభించిన నిర్విరామంగా కొనసాగిస్తామని చెప్పారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని ఆగస్టు 11న విడుదల చేస్తామని ప్రకటించారు.

విడుదల తేదిని మార్చాలని..
అయితే తాజాగా మరో అప్డేట్ ఇచ్చి అభిమానులకు నిరాశ కలిగించారు మేకర్స్. ఇప్పటికే వాయిదాలు పడిన ఈ సినిమా చిత్రీకరణ మళ్లీ వాయిదా పడింది. కథ, కాన్సెప్ట్ విషయంలో ఇబ్బందులతు ఓ షెడ్యూల్ ఇటీవల స్టార్ట్ అయిన అది ఆగిపోయింది. ఇప్పుడు వచ్చే నెలలో షూటింగ్ చేస్తారని చెబుతున్నారట. ఇలా వరసు వాయిదాలతో సినిమా విడుదల తేదిని కూడా మార్చాలని చిత్రబృందం భావిస్తోందట. మహేశ్ కు బాబుకు సెంటిమెంట్ అయిన ఆగస్టు 11న కాకుండా అక్టోబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారని టాక్.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో..
త్రివిక్రమ్-మహేశ్ బాబు కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా SSMB28ని అక్టోబర్ 18న కానీ, 20న కానీ విడుదల చేయాలని అనుకుంటున్నారట మేకర్స్. అంటే విజయదశమి దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. లాంగ్ వీకెండ్, ఫెస్టివల్ డేస్ కారణంగా అలా అయితే సినిమాకు బాగుంటుందని ఆలోచిస్తున్నారట. ఇక మొదటగా అనుకున్నట్లుగా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో కాకుండా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ ఫీస్ట్ గా ఉండాలని ప్లాన్ చేస్తున్నారట.

అలాంటి టైటిల్స్ తో..
ఇదిలా ఉండగా.. క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక, ఈ చిత్రానికి 'అర్జునుడు', 'అతడే పార్థు' వంటి టైటిళ్లు పరిశీలిస్తున్నారు. ఇక, ఈ మూవీలో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. కానీ వారి గురించి వివరాలు అధికారికంగా అయితే ఇప్పటివరకు బయటకు రాలేదు.


Click it and Unblock the Notifications











