SSMB 28: అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. కరెక్ట్ టైమ్ లో వదులుతున్న త్రివిక్రమ్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రానున్న SSMB 28 సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. చాలాకాలం తర్వాత వీరి కలయికలో వస్తున్న సినిమా కాబట్టి నిర్మాతలు కూడా భారీ స్థాయిలోనే సినిమాను నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలో సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయంలో కూడా త్రివిక్రమ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు అఫీషియల్ గా క్లారిటీ వచ్చింది. ఒక ప్రత్యేకమైన మ్యూజికల్ వీడియోతో రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేశారు.. ఆ వివరాల్లోకి వెళితే..

ఇన్నాళ్లకు పవర్ఫుల్ కాంబో

ఇన్నాళ్లకు పవర్ఫుల్ కాంబో

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పటినుంచో మహేష్ బాబుతో మరో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వెంటనే మరొక ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నప్పటికీ ఇతర కమిట్మెంట్స్ కారణంగా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా పెట్టడానికి చాలా సమయం పట్టింది ఇక అల..వైకుంఠపురములో సినిమా తర్వాత త్రివిక్రమ్ మహేష్ కోసం అద్భుతమైన కథను సిద్ధం చేది పట్టాలు ఎక్కించేందుకు సిద్ధమయ్యాడు.

స్క్రిప్ట్ కోసం..

స్క్రిప్ట్ కోసం..

ఒక విధంగా మహేష్ బాబు త్రివిక్రమ్ కథను ఫైనల్ చేయడానికి కూడా చాలా సమయం తీసుకున్నాడు. అల..వైకుంఠపురములో లాంటి సక్సెస్ తరువాత కూడా స్క్రిప్ట్ ను రీవర్క్ చేయడంలో త్రివిక్రమ్ చాలా టైమ్ తీసుకున్నాడు. మహేష్ బాబుకు నచ్చే విధంగానే ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఇక మొత్తానికి ఈ సినిమా షూటింగ్ అయితే మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతోంది పక్క ప్రణాళికలతో సినిమా షూటింగ్ను పూర్తి చేయాలని అనుకుంటున్నారు.

షూటింగ్ ప్లాన్ రెడీ

షూటింగ్ ప్లాన్ రెడీ

అసలైతే ఈపాటికి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కావాల్సింది. కానీ నిర్మాతల బంద్ కారణంగా కొన్ని రోజులు వాయిదా వేయక తప్పులేదు. అలాగే మహేష్ బాబు కూడా ఇతర కారణాల వలన ఆలస్యం చేయాల్సి వచ్చింది. ఇక మొత్తానికి రెగ్యులర్ షూటింగ్ను సెప్టెంబరు రెండో వారం నుంచి మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అఫీషియల్ డేట్ వచ్చేసింది

ఇక సినిమాకు సంబంధించిన అఫీషియల్ రిలీజ్ డేట్ పై కూడా చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చేశారు. అసలైతే వచ్చేఏడాది సమ్మర్లో సినిమాను విడుదల చేయబోతున్నట్లు ఇంతకుముందు ఒక ప్రత్యేకమైన అప్డేట్ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఏకంగా విడుదల తేదీ పై కూడా ఇచ్చారు. 2023 ఏప్రిల్ 28వ తేదీన SSMB 28వ సినిమా విడుదల కాబోతున్నట్లు స్పెషల్ వీడియో ద్వారా తెలియజేశారు.

కాంబినేషన్ తోనే భారీ అంచనాలు

కాంబినేషన్ తోనే భారీ అంచనాలు

ఇక ఈ ప్రాజెక్టులో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే త్రివిక్రమ్ అరవింద సమేత అల..వైకుంఠపురములో సినిమాలో నటించిన బుట్ట బొమ్మ ఇప్పుడు మరోసారి త్రివిక్రమ్ తో కంటిన్యూ కాబోతోంది. ఇక మహేష్ బాబుతో మహర్షి సినిమా చేసిన తర్వాత అతనితో ఆమెకు ఇది రెండవ సినిమా అవుతుంది. మొత్తానికి ఈ సినిమా కాంబినేషన్ తోనే అంచనాలను ఒక రేంజ్ లో పెంచేస్తోంది. ఇక సినిమా విడుదల తర్వాత ఎలాంటి వండర్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక హారిక హాసిని సంస్థలో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందించనున్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X