పాటలు లేకుండా సినిమా.. స్వాగతించదగిన మార్పు.. మహేష్ బాబు ట్వీట్ వైరల్
ఏదైనా సినిమా విడుదలై.. మంచి టాక్‌ను సొంతం చేసుకుంటే.. తన వంతు సహాయాన్ని అందిస్తుంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. సినిమాను చూసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటాడు. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా తన మనసుకు నచ్చితే ప్రశంసల వర్షం కురిపిస్తాడు సూపర్ స్టార్.
తాజాగా మహేష్ బాబు కార్తీ నటించిన ఖైదీ సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేస్తూ... ఖైదీ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్.. బిగితో కూడిన స్క్రిప్ట్‌లో అద్భుతమైన పర్ఫామెన్స్, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ థ్రిల్లింగ్‌గగా అనిపించాయి. పాటలు లేకుండా సినిమా.. స్వాగతించదగిన మార్పు.. చిత్ర యూనిట్‌కు కంగ్రాట్స్ అని తెలిపాడు.

ఖైదీ సినిమాను ప్రశంసిన మహేష్ బాబుకు నిర్మాత ఎస్ ఆర్ ప్రభు ధన్యవాదాలు తెలిపాడు. విజయ్ నటించిన విజిల్ చిత్రం కంటే కార్తీ నటించిన ఖైదీ సినిమానే నిలకడగా వసూళ్లను సాధిస్తోందని ట్రేడ్ వర్గాల టాక్. కొత్తగా సినిమాలను తెరకెక్కిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారే దానికి ఖైదీ ఉదాహరణ అంటూ చిత్ర బృందం పేర్కొన్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ జనవరి 12న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











