వెంకటేష్‌కి స్పెషల్ విషెస్ చెప్పిన మహేష్ బాబు.. ట్వీట్ వైరల్
నేడు (డిసెంబర్ 13) విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పెద్ద ఎత్తున బర్త్ డే విషెస్ పోస్ట్ చేస్తున్నారు సినీ ప్రముఖులు. ఈ నేపథ్యంలో తాజాగా యువ హీరో, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. వెంకటేష్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలువుతూ ట్వీట్ చేశాడు.
హ్యాపీ బర్త్ డే దగ్గుబాటి వెంకటేష్ అని పేర్కొంటూ.. ఈ ఏడాది మీకు మరింత స్పెషల్ కావాలని, మీ జీవితంలో ఆనందం, సంతోషం వెల్లువిరవాలని కోరుకున్నారు మహేష్ బాబు. ఈ మేరకు మీకు మున్ముందు మంచి సక్సెస్ రాబోతోందని అన్నారు. మహేష్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

వెంకటేష్, మహేష్ బాబు కలిసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఈ ఇద్దరి అభినయం ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ వచ్చారు వెంకటేష్.
ఇక వెంకటేష్ తాజా సినిమా 'వెంకీమామ' కూడా ఈ రోజే విడుదలైంది. తన అల్లుడు నాగచైతన్యతో కలిసి ఈ సినిమా చేశాడు వెంకీ. చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్, నాగ్ చైతన్య సరసన రాశి ఖన్నా నటించారు. వెంకీ కెరీర్‌లో తొలిసారి ఇలా పుట్టినరోజున తన సినిమా విడుదలైంది.


Click it and Unblock the Notifications











