ఒకటి కాదు.. రెండు: డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్న మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి సంవత్సరానికి ఒక సినిమాకు మించి రాదు. ఆయన నెక్ట్స్ మూవీ కోసం అభిమానులు సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సిందే. గత కొన్నేళ్లుగా మహేష్ ఇదే పద్దతి కొనసాగిస్తున్నారు. శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, స్పైడర్, భరత్ అనే నేను, ఇప్పుడు 'మహర్షి'... ఇలా సంవత్సరానికో సినిమా చేస్తున్నారు.
అయితే 2020లో మహేష్ బాబు తన అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. వచ్చే ఏడాది సూపర్ స్టార్ నటించిన రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మహేష్ వరుసగా రెండు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చారనే వార్త అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది.
25వ సినిమా 'మహర్షి'తో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న మహేష్ తన 26వ చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్ జూన్లో ప్రారంభం కాబోతోంది. సంక్రాంతికి విడుదల చేయడమే లక్ష్యంగా షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం.

దీంత పాటు మరో దర్శకుడు పరశురాంకు సైతం మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అనిల్ రావపూడి దర్శకత్వంలో చేయబోయే సినిమా షూటింగ్ పూర్తయ్యే సమయానికి పరశురాం పూర్తి స్క్రిప్టు సిద్ధం చేయబోతున్నాడు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా... మహర్షి బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంపై మహేష్ బాబు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా తనకు విజయంతో పాటు రెస్పెక్ట్ ఇచ్చిందని తెలిపారు. మే 9న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసి రూ. 200 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.


Click it and Unblock the Notifications











