SSMB28: మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరో సర్‌ప్రైజ్ ఏమిటంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రెండు షెడ్యూల్స్ ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి. మహేష్ బాబు వెకేషన్ పూర్తి చేసుకొని వస్తే నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల ఆఖరులో సూపర్ స్టార్ కృష్ణ జయంతి ఉండటంతో అప్పటికి మహేష్ బాబు అందుబాటులోకి రానున్నాడు.

ఇక కృష్ణ జయంతి సందర్భంగా మోసగాళ్ళకి మోసగాడు సినిమాకి 4కెలో థియేటర్స్ లో రీరిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక కృష్ణ జయంతి రోజునే ఎస్ఎస్ఎంబి 28 మూవీకి సంబందించిన టీజర్ కూడా లాంచ్ చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబందించిన వర్క్ ప్రస్తుతం జరుగుతోందని టాక్. అయితే ఈ మధ్య టీజర్, ట్రైలర్ ని థియేటర్స్ లో రిలీజ్ చేయడం ట్రెండ్ గా మారింది.

Mahesh babu upcoming movie SSMB 28 project teaser surprise in theatres

ఆదిపురుష్ ట్రైలర్ ని థియేటర్స్ లో రిలీజ్ చేసి కొత్త ట్రెండ్ కి తెరతీసారు. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ ని కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో దేవి థియేటర్ లో లాంచ్ చేశారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ మూవీ టీజర్ ని కూడా థియేటర్స్ లోనే లాంచ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. కృష్ణ మోసగాళ్ళకి మోసగాడు మూవీ రీరిలీజ్ చేసే థియేటర్స్ లో టీజర్ ని కూడా ఎటాచ్ చేసి లాంచ్ చేయాలని అనుకుంటున్నారంట.

దీనికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. టీజర్ లాంచ్ అయిన తర్వాత ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసే ప్లాన్ లో త్రివిక్రమ్ ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఎస్ఎస్ఎంబి 28 మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ వెటరన్ స్టార్ కాజోల్ ని ఈ మూవీలో స్పెషల్ రోల్ కోసం తీస్తుకోస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Mahesh babu upcoming movie SSMB 28 project teaser surprise in theatres

పల్నాడు బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గానే ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ తెరకెక్కిస్తూ ఉన్నాడు. మహేష్ బాబుతో గతంలో అతడు, ఖలేజా సినిమాలు త్రివిక్రమ్ చేశారు. అయితే ఈ రెండు థియేటర్స్ లో ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. ఈ సారి అలాంటి పొరపాటు జరగకుండా తనకి అలవాటైన జోనర్ లోనే మూవీని తెరకెక్కించి హిట్ కొట్టే ప్రయత్నంలో త్రివిక్రమ్ ఉన్నారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X