SSMB Rampage: ఇక మహేష్ అభిమానులు సిద్ధమవ్వండి.. ఆ రోజు దద్దరిల్లాల్సిందే..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ చివరగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి కమర్షియల్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఆ సినిమా తరువాత వెంటనే మరో సినిమా చేయాలని అనుకున్నప్పటికి కరోనా దెబ్బ కొట్టింది. ఇక ఆ గ్యాప్ లో పరశురామ్ తో సినిమా ఓకే చేసుకొని వెంటనే టైటిల్ పై కూడా క్లారిటీ ఇచ్చేశాడు. ఆ తరువాత చేయబోయే ప్రాజెక్టుల ప్లాన్ కూడా సిద్ధమయ్యింది. ఇక అన్ని అప్డేట్స్ ఒకేరోజు రాబోతున్నాయి.

వీలైనంత త్వరగా పూర్తి చేయాలని
మహేష్ బాబు ఒక సినిమాను స్టార్ట్ చేస్తే వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తారు. కరోనా లేకపోయి ఉంటే ఈపాటికే ఒక సినిమాను రిలీజ్ చేసి మరొక సినిమాను కూడా రెడీ చేసేవారు. అంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకునే మహేష్ బాబును కరోనా అడ్డుకుంది. ఈ రేంజ్ లో కరోనా దెబ్బ కొడుతుందని ఎవరు ఊహించలేదు.

ఆ డేట్ కోసం..
ఇక బుధవారం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా బ్యాక్ టూ బ్యాక్ అప్డేట్స్ తో అభిమానులు సోషల్ మీడియాలో బాగానే సందడి చేశారు. ఇక ఇప్పుడు మహేష్ అభిమానులు కూడా స్పెషల్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. అదే మే 31. ఆ రోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కావడంతో మహేష్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రానున్నాయి.

ఆ సినిమా లుక్ రెడీ.. ఎప్పుడంటే..
సాధారణంగా మహేష్ బాబు ప్రతి ఏడాది తండ్రి పుట్టినరోజు సందర్భంగా ఎదో ఒక అప్డేట్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నదే. ఇక ముందుగా సర్కారు వారి పాటకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయాలని రెడీ అవుతున్నారు. బ్యాంక్ మేనేజర్ గా కనిపించనున్న మహేష్ నెవర్ బిఫోర్ అనే లుక్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం #SSMBRampageOnMAY31st హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Recommended Video

అన్ని అనుమానాలు ఆ రోజు క్లియర్ అవుతాయి
ఇక అదే రోజు త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా రావచ్చని సమాచారం. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమా లాంచ్ జరగవచ్చని కామెంట్స్ వస్తున్నాయి కానీ ఎంతవరకు నిజమో తెలియదు. ఇక అనిల్ రావిపూడితో సినిమా చేయడానికి మహేష్ ఒప్పుకుంటాడా లేదా అనే విషయంలో కూడా ఆ రోజే క్లారిటీ రానుంది.


Click it and Unblock the Notifications











