SSMB29: మహేష్ బాబు కోసం స్టార్ హీరోయిన్ తో చర్చలు.. రాజమౌళి కూడా త్రివిక్రమ్ బాటలోనే?

సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కలయికలో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా యాక్షన్ మూవీ కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల కథనాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కూడా దాదాపు ఫైనల్ అయ్యింది అని కథనాలు వస్తున్నాయి. ఆ విషయంలో రాజమౌళి కూడా త్రివిక్రమ్ బాటలోనే కొనసాగిస్తున్నాడు అనే కామెంట్స్ కూడా చాలానే వస్తున్నాయి ఆ వివరాల్లోకి వెళితే..

న్యూ రికార్డు..

న్యూ రికార్డు..

దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా అనంతరం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. గత ఏడాది నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ భారీ చిత్రం మార్చి 25 వ తేదీన ఇండియా లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో విడుదల అవుతున్న పాన్ ఇండియా సినిమాగా కూడా రికార్డు క్రియేట్ చేయబోతోంది.

బడ్జెట్ విషయంలోనే కాకుండా..

బడ్జెట్ విషయంలోనే కాకుండా..

దర్శకధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా అంతకు మించి అనేలా ఆలోచిస్తాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. బడ్జెట్ విషయంలోనే కాకుండా స్టార్ క్యాస్టింగ్ విషయంలో కూడా హై రేంజ్ కు తగ్గట్టుగా ఉంటాయి. ఇక మహేష్ బాబు తో చేయబోయే సినిమా కూడా అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఆ సినిమాలో మరొక బాలీవుడ్ హీరో కూడా కనిపించబోతున్నాడు అని గతంలో ఒక టాక్ వినిపించిన విషయం తెలిసిందే.

త్రివిక్రమ్ తరహాలోనే..

త్రివిక్రమ్ తరహాలోనే..

హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ అయితే కాలేదు. మహేష్ బాబు రాజమౌళి ఉంటే తప్పకుండా హీరోయిన్ కూడా నెంబర్ వన్ ప్లేస్ లో ఉండాలి అనే చెప్పాలి. ఆ విధంగా ఆలోచిస్తున్న రాజమౌళి మరోసారి బాలీవుడ్ అగ్రహీరోయిన్ సంప్రదిస్తున్నట్లు సమాచారం. పూజా హెగ్డే ను ఎలాగైతే త్రివిక్రమ్ కంటిన్యూగా కొనసాగిస్తున్నారో అదే తరహాలో రాజమౌళి కూడా ఆలియా భట్ ను మహేష్ సినిమా కోసం కొనసాగించేలా ఉన్నట్లుగా తెలుస్తోంది.

అలియా భట్ ఫిక్స్?

అలియా భట్ ఫిక్స్?

RRR సినిమాలో అలియా భట్ రామ్ చరణ్ కు జోడీగా సీత పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక మహేష్ బాబు 29వ సినిమా కోసం కూడా రాజమౌళి ఆమెనే ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే కాకుండా కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా నటించాలి అని ఆమెను తీసుకునే అవకాశం ఉందట.

Recommended Video

Rajamouli గురించి తెలిసే Mahesh Babu ఇలా | Mahesh Babu Rajamouli Movie || Filmibeat Telugu
అత్యధిక రెమ్యునరేషన్..

అత్యధిక రెమ్యునరేషన్..

మహేష్ బాబు రాజమౌళి సినిమాలో అలియా భట్ కు నిజంగా నటించే అవకాశం వస్తే మరోసారి ఆమె నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నట్లే అని చెప్పవచ్చు. ఇప్పటికే RRR సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా ద్వారా అలియా భట్ అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ గా కూడా ఇండస్ట్రీలో చక్రం తిప్పుతోంది. ఇక మహేష్ సినిమా కోసం కూడా ఆమె అంతకు మించి అనేలా రెమ్యునరేషన్ తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X