మహేశ్ బాబు - వంశీ పైడిపల్లి స్టోరీ లైన్ లీక్.. నెవ్వర్ బీఫోర్ క్యారెక్టర్‌తో రాబోతున్న సూపర్ స్టార్.
సూపర్ స్టార్ మహేశ్ బాబు.. టాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో ఒకడు. కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు. దీనికితోడు అందం కూడా తోడవడంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అంతేకాదు, సినిమా సినిమాకూ వేరియేషన్ చూపిస్తూ సక్సెస్ అవుతున్నాడు. ఇక, ఇటీవల వరుస విజయాలను అందుకుంటున్న మహేశ్.. త్వరలోనే వంశీ పైడిపల్లితో సినిమా చేయనున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ లీక్ అయింది. అందులో ఏముంది.? వివరాల్లోకి వెళితే...

సరిలేరు అనిపించుకున్న మహేశ్ బాబు
మహేశ్ బాబు ఇటీవల నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు'. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. ఇప్పటికే ఈ సినిమా దాదాపు రూ. 120 కోట్లు పైచిలుకు షేర్ రాబట్టింది. ఇందులో రష్మిక హీరోయిన్‌గా నటించింది.

అందరితో కలిసి అక్కడ కనిపించాడు
‘సరిలేరు నీకెవ్వరు' ఇచ్చిన జోష్‌తో సూపర్ స్టార్ మహేశ్ బాబు రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. అందుకే ఈ సినిమా ఫలితం వచ్చిన వెంటనే అతడు ఫ్యామిలీతో కలిసి ఫారెన్ చెక్కేశాడు. హాలీడే ట్రిప్‌గా భావిస్తున్న ఈ టూర్‌లో మహేశ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

హిట్ ఇచ్చిన డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్
మహేశ్ బాబు మిగిలిన హీరోలతో పోలిస్తే తన సినిమాలను వరుసగా ఓకే చేసేస్తుంటాడు. ఇందులో భాగంగానే సరిలేరు విడుదల కాకముందే తన తదుపరి సినిమాను ఫైనల్ చేసేశాడు. గతంలో ‘మహర్షి' వంటి హిట్ ఇచ్చిన స్టైలిష్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితోనే అతడు మరోసారి జతకట్టబోతున్నాడు. ప్రస్తుతం వంశీ ఈ సినిమా స్క్రిప్టు వర్క్ చేస్తున్నాడు.

మహేశ్ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదా.?
సినిమా సినిమాకూ చాలా గ్యాప్ తీసుకుంటుంటాడు మహేశ్ బాబు. గతంలో ఆయన ఇదే తరహాగా వ్యవహరించాడు. దీంతో ఇప్పుడు కూడా అలాగే చేస్తాడన్న టాక్ వినిపిస్తోంది. దీనికితోడు, వంశీ స్క్రిప్టు విషయంలో చాలా సమయం తీసుకోబోతున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో మరోసారి సూపర్ స్టార్ అభిమానులకు నిరాశ తప్పదన్న టాక్ వినిపిస్తోంది.

మహేశ్ - వంశీ పైడిపల్లి స్టోరీ లైన్ లీక్
ఈ సినిమాలో మహేశ్ బాబు గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నాడని, అతడి నేపథ్యంతో సినిమా సాగుతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీ పర్యావరణాన్ని రక్షించే గ్యాంగ్‌స్టర్ కథగా వస్తుందట. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సోషల్ మెసేజ్ కూడా ఉంటుందని అంటున్నారు.

నెవ్వర్ బీఫోర్ క్యారెక్టర్‌తో సూపర్ స్టార్.!
మహేశ్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని వంశీ పైడిపల్లి అదిరిపోయే క్యారెక్టరైజేషన్‌ను రెడీ చేస్తున్నాడని కూడా తాజాగా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఇందులో మహేశ్ లుక్, మేనరిజం చూసిన తర్వాత నెవ్వర్ బిఫోర్ సూపర్ స్టార్ అంటారట. అంతలా ప్రభావం చూపించే పాత్రను రాస్తున్నాడని తెలిసింది.


Click it and Unblock the Notifications











