Just In
- 30 min ago
వంద వంద వేసుకుని తాగాం.. నైట్ అలాంటి పనులు చేశాం: కాలర్ ఎగరేసి చెబుతున్నానంటూ విజయ్ ఎమోషనల్
- 11 hrs ago
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- 12 hrs ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 13 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
Don't Miss!
- Lifestyle
పీరియడ్ అండర్ వేర్ ఎలా పని చేస్తుందో తెలుసా...
- Finance
మహిళల కోసం నీతా అంబానీ 'హర్ సర్కిల్': చదువుకోవచ్చు, వీడియోలు చూడవచ్చు
- News
మహిళలకు కీలక హామీ: రేషన్ కార్డు ఉంటే చాలు.. ప్రతినెలా నగదు: మేనిఫోస్టో ఛాంపియన్
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దుబాయ్ పయనమైన మహేశ్ బాబు: దాని కోసమే అని ప్రచారం.. ముందే లీక్ చేసిన సితార
ఇటీవలి కాలంలో 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి వరుస విజయాలను అందుకుంటూ ఫుల్ జోష్ మీద ఉన్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కుటుంబ కథా చిత్రాల దర్శకుడు పరశురాంతో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఈ మూవీ పూజా కార్యక్రమం జరిగింది. అయితే, షూటింగ్ మాత్రం ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ న్యూస్ లీకైంది.
మహేశ్ బాబు.. తన కుటుంబ సభ్యులతో గురువారం ఉదయం కలిసి దుబాయ్ పయనం అయ్యాడు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన కుమార్తె సితార ఘట్టమనేని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అంతేకాదు, 'దుబాయ్ వెళ్లే సమయం వచ్చింది. మా అన్నయ్య ఎప్పుడూ మిస్ అవుతూనే ఉంటాడు' అని ఈ చిన్నారి అందులో పేర్కొంది.

ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లేది ట్రిప్‌ను ఎంజాయ్ చేయడం కోసం కాదట. జనవరి 25 నుంచి జరగబోయే 'సర్కారు వారి పాట' షూటింగ్‌లో పాల్గొనడం కోసమేనని తెలుస్తోంది.

వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా... అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఆ మధ్య మొదలెట్టాలనుకున్నా కరోనా వైరస్ ప్రభావంతో రద్దయింది. దీంతో ఈ సారి షూటింగ్ మొదలైతే నిరంతరాయంగా చిత్రీకరణ జరపాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకే అమెరికా షెడ్యూల్ క్యాన్సిల్ అవడంతో.. దుబాయ్ షెడ్యూల్‌ను ముందుకు జరిపారు. అక్కడ హీరో హీరోయిన్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని తెలుస్తోంది. దీని తర్వాత హైదరాబాద్‌లో జరగనున్న లాంగ్ షెడ్యూల్‌లో చిత్ర యూనిట్ పాల్గొంటుందని సమాచారం.