Don't Miss!
- News
ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ఇంటికి వెళ్లిన జగన్ దంపతులు
- Finance
Twitter Blue: శుభవార్త చెప్పిన ఎలాన్ మస్క్.. ట్విట్టర్ బ్లూ ఖాతాదారులకు కనకవర్షం..
- Sports
INDvsAUS : ఆసీస్‌కు అది అలవాటే.. అది వాళ్ల మైండ్ గేమ్.. అశ్విన్ ఘాటు రిప్లై!
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
కరోనా సంక్షోభానికి చెక్ పెట్టాలంటే.. అలా చేయాల్సిందే.. సర్కార్‌కు మహేష్‌బాబు సతీమణి సూచన
దేశవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్న సమయంలో పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ఊపందుకొన్నది. ఒక్కొరాష్ట్రం ఒక్కో విధంగా వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను చేపట్టాయి. తాజాగా మధ్య ప్రదేశ్, మహరాష్ట్రలోని కీలక పట్టణాలు భోపాల్, ముంబైలో వాక్సినేషన్ ప్రక్రియ జోరందుకొన్నది. భోపాల్, ముంబైలో జరుగుతున్న వాక్సినేషన్ ప్రక్రియపై సూపర్‌స్టార్ మహేష్ బాబు సతీమణి, మాజీ మిస్ ఇండియా నమత్ర శిరోద్కర్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ రెండు పట్టణాల్లో జరుగుతున్న వాక్సినేషన్ ప్రక్రియపై ప్రశంసల జల్లు కురిపించారు.
అందానికి మరో అర్దాన్ని చెబుతున్న హీనా పంచల్
ముంబై, భోపాల్ నగరాల్లో వయోవృద్ధులకు, సీనియర్ సిటిజన్లకు కారులోనే వాక్సినేషన్ ఇస్తున్న తీరు అందర్నీ ఆకట్టుకొంటున్నది. ఈ సందర్భంగా ఆయా ప్రభుత్వ అధికారుల చర్యలను అభినందిస్తున్నారు.

ఈ సందర్భంగా నమ్రత శిరోద్కర్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందిస్తూ... కరోనా సంక్షోభం నుంచి బయటపడాలంటే.. తప్పనిసరిగా వాక్సినేషన్ తీసుకోవాల్సిందే. అంటూ కామెంట్ చేశారు. భోపాల్; ముంబై నగరాల్లో డ్రైవ్ ఇన్ వాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నది. సీనియర్ సిటిజన్లకు వారి కారులోనే వాక్సిన్ షాట్స్ ఇవ్వడం సూపర్ కూల్ కదా.. ఇలాంటి కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చేపట్టాలి అని నమ్రత శిరోద్కర్ సూచించారు.