త్వరలోనే ఆ దేశానికి మహేశ్ బాబు: వాళ్లతో పాటు ఫ్యామిలీ మొత్తం ఫ్లైట్ ఎక్కబోతుందట
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'భరత్ అనే నేను' మూవీ నుంచి హిట్లు మీద హిట్లు కొడుతూ కొంత కాలంగా ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఇప్పటికే వంశీ పైడిపల్లితో 'మహర్షి', అనిల్ రావిపూడితో 'సరిలేరు నీకెవ్వరు' వంటి విజయాలను అందుకున్న అతడు.. రెట్టించిన ఉత్సాహంతో ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తన తదుపరి ప్రాజెక్టుగా వంశీ పైడిపల్లితో ఓ సినిమాను చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికి సంబంధించిన ప్రకటన వస్తుందన్న టాక్ వినిపించిన సమయంలోనే.. ఎందుకనో పట్టాలెక్కించలేదు.
వరుస విజాయలతో దూసుకెళ్తోన్న మహేశ్ బాబు ప్రస్తుతం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీలకు పెట్టింది పేరైన పరశురాం దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఇది భారీతనంతో రూపొందుతోంది. ఈ ఏడాది ఆరంభంలో దుబాయ్‌లో ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభం అయింది. అక్కడి నుంచి వచ్చిన వెంటనే హైదరాబాద్‌లో రెండో దానిని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఇక, ఇటీవలే మూడో షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ గోవా వెళ్లింది. ఇది కూడా కొద్ది రోజుల క్రితమే సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది.

ప్రస్తుతం 'సర్కారు వారి పాట' మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో ప్రముఖ నటీనటులపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో హీరో, విలన్ మధ్య వచ్చే హైలైట్ సీన్స్‌ను కూడా షూట్ చేశారట. ఇలా ఇప్పటికే 60 శాతం వరకూ చిత్రీకరణ పూర్తైనట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా యూనిట్ త్వరలోనే స్పెయిన్ వెళ్లబోతుందట. అక్కడ కొన్ని సీన్స్‌తో పాటు ఓ పాటను కూడా చిత్రీకరిస్తారని సమాచారం. దీనికి మహేశ్ తన ఫ్యామిలీతో వెళ్లబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.
బ్యాంకులను మోసం చేసి పరారవుతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఇటీవల విడుదలైన టీజర్‌లో మహేశ్ బాబును అల్ట్రా స్టైలిష్ గెటప్‌తో చూపించారు. అలాగే, అతడు చెప్పిన డైలాగ్స్, చూపించిన గ్రేస్ అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. వీటితో పాటు థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సూపర్బ్‌గా ఉంది. దీంతో ఈ టీజర్‌కు ఇప్పటికీ అదిరిపోయే స్పందన వస్తోంది. ఫలితంగా 'సర్కారు వారి పాట బర్త్‌డే బ్లాస్టర్' వీడియో టాలీవుడ్ చరిత్రలోనే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది.
'సర్కారు వారి పాట' మూవీలో మహేశ్ బాబు మాస్ రోల్ చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఇటీవల విడుదలైన టీజర్‌లో అతడిని అదిరిపోయే రేంజ్‌లో చూపించారు. ఇక, ఇందులో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. దీన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











