మహేష్ బాబు ఫ్యాన్స్‌కు శుభవార్త.. సూపర్ స్టార్ కృష్ణ కోసం క్రేజీ మూవీ.. రీ రీలీజ్ ఎప్పడంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమా షూటింగ్ బిజీలో ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం రాత్రింబళ్లు శ్రమిస్తున్నారు. గత రెండేళ్లుగా ఆయన నటించిన సినిమా లేకపోవడంతో అభిమానులు కొంత నిరూత్సాహంలో ఉన్నారు. అయితే ఫ్యాన్స్ అసంతృప్తిని బయటకు రాకుండా మహేష్ నటించిన సినిమాలను రీ రిలీజ్ చేసి జోష్ పెంచుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన నటించిన సినిమాలను రీ రిలీజ్ చేసే పనిలో నిర్మాతలు, అభిమానులు ఉన్నారు. తాజాగా ఆయన వర్గీయులు సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు అందించిన శుభవార్త విషయంలోకి వెళితే...

సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే అయినా.. మహేష్ బాబు పుట్టిన రోజు వస్తే.. అభిమానులు పండుగలా చేసుకొంటారు. ఆయన నటించే సినిమాలకు సంబంధించిన గ్లింప్స్ గానీ, లేదా టీజర్, ట్రైలర్ లాంటివి రిలీజ్ చేస్తే వారి ఆనందానికి అవధులు ఉండవనేది చాలా సందర్భాల్లో చేశాం. అయితే ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ ఫంక్షన్లు చేస్తూ సందడి చేస్తున్నారు.

Mahesh Babu s Athidhi Movie Rerelease

తన అభిమానుల కోసం మహేష్ బాబు ఓ నిర్ణయం తీసుకొన్నారు. తన తండ్రి, స్వర్గీయ కృష్ణ పుట్టిన రోజు అంటే మే 29వ తేదీన తాను నటించిన అతిథి చిత్రాన్ని రీ రీలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణకు నివాళిలర్పించేందుకు ఈ సినిమా ద్వారా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అతిథి సినిమాను 4K టెక్నాలజీతో లేటేస్ట్ హంగులతో సిద్దం చేశారు. తన సినిమాకు సంబంధించిన అప్ డేట్‌ను కూడా ఇస్తే బాగుంటుందని ఆలోచన చేేస్తున్నారు.

ఇదిలా ఉండగా, మహేష్ బాబు నటించిన వారణాసి సినిమా రిలీజ్‌కు సరిగ్గా 365 రోజులు ఉంది. ఏప్రిల్ 27, 2027 తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి టీమ్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించడం తెలిసిందే. ఈ సినిమాకు ముందు రెండు, మూడు మహేష్ బాబు నటించిన చిత్రాలను రీ రిలీజ్ చేసే పనిలో కూడా ఉన్నారు.

వారణాసి సినిమా విషయానికి వస్తే.. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న చిత్రం వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో 29వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం, విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు.

ఈ సినిమాకు కథ, మాటల సహకారాన్ని దేవకట్టా అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌గా తమ్మిరాజు, ఫైట్స్ కింగ్ సాల్మన్, సినిమాటోగ్రఫిని ఎస్ గోపాల్ రెడ్డి, పీఎస్ వినోద్ అందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ రివీల్ ఈవెంట్ ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్‌గా రిలీజ్ చేయడం తెలిసిందే.

More from Filmibeat

Read more about: mahesh babu athidhi krishna
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X