‘బ్రహ్మోత్సవం డిజాస్టర్ కారణం అతడే.. మహేష్ బాబుతో సినిమా తీయడం..’

టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతగా, ఫైనాన్షియర్‌గా, రాజకీయ నాయకుడిగా తన కంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకొన్న వారిలో పొట్లూరి వీ ప్రసాద్ అలియాస్ పీవీపీ ఒకరు. తన అభిరుచికి తగిన చిత్రాలను నిర్మించి విజయాలు సాధించారు. అగ్ర హీరోలతో తీసిన భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భోర్లా పడ్డాయి. అయినా తన పంథాలో సినిమాలు చేసుకొంటూ వెళ్తున్నారు. ఇటీవల యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబుతో నిర్మించిన బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్ గురించి కుండబద్దలు కొట్టినట్టు విషయాలు చెప్పారు. బ్రహ్మోత్సవం ఫ్లాప్ వెనుక కారణాలను విశ్లేషిస్తూ..

సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు, కాజల్ అగర్వాల్ జంటగా బ్రహ్మోత్సవాన్ని రూపొందించారు. ఈ సినిమాను సుమారుగా 75 కోట్ల రూపాయలతో పీవీపీ నిర్మించారు. అయితే ఈ సినిమా ఫస్ట డే ఫస్ట్ షో తర్వాత డిజాస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ చిత్రం థియేట్రికల్ రన్‌లో 65 కోట్ల మేర వసూళ్లను సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయం గురించి పీవీపీ కుండబద్దలు కొట్టినట్టు తన అాభిప్రాయాలను వెల్లడించారు.

Reason behind Brahmotsavam disaster

బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు మెయిల్ రాశాను. స్క్రిప్టు పూర్తి కాకుండా షూటింగ్‌కు వెళ్లకూడదని చెప్పాను. డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల డబ్బుతో సినిమా చేస్తున్నాం. వాళ్ల డబ్బుతో సినిమా చేస్తున్నాం. వారికి న్యాయం చేయాలని చెప్పాను. బ్రహ్మోత్సవం సినిమా మంచి స్క్రిప్ట్. దర్శకుడి నిర్లక్ష్యం, క్రమశిక్షణ లేకపోవడం దెబ్బ తిన్నాం. ఆ సినిమా డిజాస్టర్ అయింది. సినిమా ఇండస్ట్రీలో ప్రధానమైన సమస్య నిర్లక్ష్యం, క్రమశిక్షణ లేకపోవడమే అని నిర్మాత ప్రసాద్ వీ పొట్లూరి అన్నారు.

దర్శకుడి పనితీరు, స్క్రిప్టు విషయంలో అజాగ్రత్తలే నిర్మాతలను ఊహించని నష్టాలకు గురి చేస్తున్నాయి. సినిమా నిర్మాణం ఒకప్పుడు నిర్మాత నియంత్రణలో ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా దర్శకుడి చేతుల్లోకి వెళ్లిపోయింది. 70, 80వ దశకంలో కథలు, సినీ నిర్మాణంపై పూర్తిగా ప్రొడ్యూసర్‌కు కంట్రోల్ ఉండేది. కానీ ప్రస్తుతం పెట్టుబడి పెట్టే వ్యాపారవేత్తలుగానే మిగిలిపోయారు. అందుకు కారణం నిర్మాతలే కారణం. సినిమా ఇండస్ట్రీని భ్రష్టుపట్టించేదే నిర్మాతలు, భారీగా హీరోలకు, నిర్మాతలకు భారీగా అడ్వాన్సులు ఇచ్చి తప్పు చేశారు అని ఆయన అన్నారు.

సినిమా ఇండస్ట్రీలో మార్కెట్ డిమాండ్, సప్లై సూత్రం ప్రకారమే పనిచేస్తుంది. హీరోకు డిమాండ్ ఉంటే నిర్మాతలు వెంటపడి ఆఫర్లు ఇస్తారు. రెమ్యునరేషన్లు భారీగా పెంచుతారు. అయితే హీరోలు కూడా నిర్మాత క్షేమాన్ని కోరుకోవాలి. కానీ ఆ పరిస్థితులు లేవు. కొందరు మాత్రమే నిర్మాత కష్టాన్ని గుర్తించి వారికి అండగా ఉంటారు అని ప్రసాద్ వీ పొట్లూరి అభిప్రాయపడ్డారు.

సినిమా ఫ్లాప్ అయినప్పుడు 100 తప్పులు కనిపిస్తాయి. అయితే ఫ్లాప్ కాకముందే వాటిని గుర్తించి తప్పులను సరిదిద్దుకోవాలే. అప్పుడే డిజాస్టర్లను నివారించవచ్చు. తెరపైన హీరోలుగా కనిపించే వారు నిజ జీవితంలో కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. అప్పడే పరిశ్రమ మనుగడ ఉంటుంది. మహేష్ బాబుతో పనిచేయడం, ఆయనతో సినిమా తీయడం గొప్ప అనుభూతి. అనుష్క శెట్టి బాధ్యతాయుతంగా ఉంటారు అని ఆయన ఇండస్ట్రీలోని విషయాలను పంచుకొన్నారు.

Read more about: mahesh babu pvp brahmotsavam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X