మహేష్ బాబు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్.. కారుకు చలానా..తట్టుకోలేక అభిమాని జరిమానా చెల్లింపు1

సినీ పరిశ్రమలో హీరోలను అభిమానులు ఎంత పిచ్చిగా, గుడ్డిగా ఆరాధిస్తారనే విషయంపై కొత్తగా చెప్పనక్కర్లేదు. నేరుగా తమకు పరిచయం లేకున్నా వారి కోసం రక్తదానాలు, నేత్రదానం, పేదలకు, రోగులకు ఆహారం, ఫలాలు పంచే పనులు చేస్తుండటం చూస్తూనే ఉంటాం. తమ హీరోల పేరు ప్రతిష్టలకు ఎలాంటి భగం కలగుకుండా, వారి పాపులారిటీకి మచ్చ పడకుండా జాగ్రత్తలు తీసుకొంటంటారు. తాజాగా మహేష్ బాబు విషయంలో అభిమాని చేసిన పనికి నెటిజన్లు ముక్కను వేలేసుకొంటున్నారు. ఇదేంటిరా.. ఇంత అభిమానమా? అని చర్చించుకొంటున్నారు. మహేష్ బాబు కోసం అభిమాని చేసిన పని ఏమిటనే వివరాల్లోకి వెళితే..

సూపర్ స్టార్ మహేష్ తాజాగా తన కెరీర్‌లో 29వ సినిమాతో రెడీ అవుతున్నారు. ఇటీవలే ఆ సినిమాకు సంబంధించిన టైటిల్, లుక్ ఆవిష్కరణకు సంబంధించిన ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో భారీగా నిర్వహించారు. ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇలాంటి నేపథ్యంలో మహేష్ బాబు ట్రెండింగ్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారనే విషయం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది.

Mahesh Babu s Car breaks Traffic Rules

సూపర్ స్టార్ మహేష్ బాబు పేరుపై ఉన్న కారు ఇటీవల పీవీ నర్సింహరావు ఎక్స్‌ప్రెస్ హైవే ప్రయాణించింది. వారణాసి (SSMB29) మూవీ ఈవెంట్ సందర్భంలో బహుశా ప్రయాణించి ఉండవచ్చు. ఈ సమయంలో ఆయన కారు ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించింది. మొదటి సారి అక్టోబర్ 4వ తేదీన, రెండోసారి అక్టోబర్ 15వ తేదీన మితిమీరిన వేగంతో ప్రయాణించిందని ట్రాఫిక్ గన్స్‌ రికార్డు చేసిన విషయాన్ని హైదరాబాద్ ట్రాఫిక్ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకంగా ఓవర్ స్పీడ్.. డేంజరస్ డ్రైవింగ్ అంటూ తెలంగాణ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ జరిమానా విధించింది. ఈ మేరకు కారు నంబర్ (TS36N4005)పై చలానాలను వైబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఒకసారి కుల్సంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో, రెండోసారి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన జరిగింది. నిర్ధేశించిన వేగం కంటే.. అతిగా ప్రయాణించారని చలాన్ల రూపంలో కొరడా ఝుళిపించారు.

Mahesh Babu s Car breaks Traffic Rules

అయితే మహేష్ బాబు కారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, వాటిపై జరిమానా, చలానాలు విధించడంపై ఆయన అభిమాని మనస్తాపానికి గురయ్యాడు. ఆ విషయాన్ని జీర్ణించుకోలేక వెంటనే అభిమాని తమ హీరోపై ఉన్న చలానాలను క్లియర్ చేసేందుకు స్వయంగా జరిమానా చెల్లించాడు. దాదాపు 2070 రూపాయలను అభిమాని చెల్లించినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో, వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ఈ వ్యవహారంపై మహేష్ బాబు ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: mahesh babu telangana Varanasi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X