గుంటూరు కారం నుంచి లీక్స్.. పాపం వదిలేట్టు లేరుగా!
హీరో మహేశ్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో చాలా కాలం తర్వాత వస్తున్న చిత్రం గుంటూరు కారం. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఇద్దరి కాంబోలో ఈ మూవీ తెరకెక్కుతోంది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ వస్తోండగా... తాజాగా గుంటూరు కారం సినిమా సెట్స్ పైకి వెళ్లింది. అయితే ఈ సినిమా నుంచి కొన్ని స్టిల్స్ లీక్ అయినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే...

మహేశ్- త్రివిక్రమ్ కాంబో కోసం వెయిటింగ్: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరి కాంబోలో ఈ సినిమా వస్తోంది. అయితే ఈ సినిమా పలు కారణాల చేత వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా గుంటూరు కారం సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఇక ఈ సినిమాలో మొదటగా పూజ హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు అనుకోగా... అయితే ఆ తర్వాత పూజ హెగ్డే తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.
పూజ అవుట్.. మీనాక్షి కమింగ్..:అయితే పూజ స్థానంలోకి శ్రీలీల ఎంటర్ కాగా.. శ్రీలీల స్థానంలోకి మీనాక్షి చౌదరి వచ్చినట్లు టాక్. మేకర్స్ నుంచి అఫీషియల్ క్లారిటీ లేదు. ఈ విషయంపై త్వరలో అనౌన్స్మెంట్ వస్తుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గుంటూరు కారం లేటెస్ట్ షెడ్యూల్ శంకరపల్లి దగ్గరలోని జనవాడాలో మొదలయ్యింది. మూడు నాలుగు రోజులు మాత్రమే జరగనున్న ఈ షెడ్యూల్ కోసం భారీ సెట్ వేశారు.

గుంటురు కారం లీకులు: దాదాపు నెల రోజుల తర్వాత గుంటూరు కారం షూటింగ్ అలా స్టార్ట్ అయ్యిందో లేదో ఇలా సోషల్ మీడియాలో లీకులు వచ్చేశాయి. మహేష్ బాబు చిన్నప్పటి వాల్ ఫొటోస్, శ్రీలీలా మహేష్ బాబు ఉన్న ఇంకో ఫోటో ఫ్రేమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గుంటూరు కారం సినిమాకి లీకులు కొత్తేమి కాదు షూటింగ్ స్టార్ట్ అయిన రోజు నుంచి లీకులు బయటకి వస్తూనే ఉన్నాయి. మహేష్ బాబు హెడ్ స్కార్ఫ్ కట్టుకున్న ఫోటో ఇలా రకరకాల స్టిల్స్ షూటింగ్ స్పాట్ నుంచి బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సినిమాపై భారీ అంచనాలు: ఇక గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే.. ఇటీవల రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్ కు మంచి స్పందన వస్తోంది. గుంటూరు కారం 2024 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాతలుగా వ్యవహారిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మహేశ్ బాబు జక్కన్నతో పాన్ వరల్డ్ సినిమా తీయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











