మహేష్ బాబు ప్రాణాలతో ఆ డైరెక్టర్ రిస్క్.. ఏ మాత్రం తేడా జరిగినా అంతే..

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లెజెండరీ నటుడు కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు... అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగి, తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఇండస్ట్రీలో తన పేరిట ప్రత్యేక రికార్డులను నెలకొల్పారు. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్. ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ వారణాసి (Varanasi)లో నటిస్తూ గ్లోబల్ స్టేజ్‌పై అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ బజ్‌ను క్రియేట్ చేస్తోంది.

ముఖ్యంగా టైటిల్ గ్లింప్స్, మహేష్ బాబు 'రుద్ర' లుక్, హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ చిత్రంలో విలన్‌గా సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఇలాంటి హైప్ మధ్య... మహేష్ బాబు కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిన మురారి (Murari) సినిమా షూటింగ్ సమయంలో చోటుచేసుకున్న ఓ ప్రమాదకర సంఘటన ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చింది. ఇలాంటి సమయంలో మహేష్ బాబు ప్రాణాలను ప్రమాదంలో పెట్టి ఓ డైరెక్టర్ సినిమా తీశారట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? ఇంతకీ ఏం జరిగిందంటే?

Mahesh Babu s Life at Risk During Murari Shoot Krishna Vamsi s Dangerous Scene Revealed

ఆ డైరెక్టర్ ఎవరో కాదు సెన్సేషనల్ డైరెక్టర్ కృష్ణవంశీ. కృష్ణవంశీ-మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ మురారి. ఈ సినిమా ఇటు కృష్ణవంశీ కెరీర్ కే కాకుండా.. మహేష్ బాబు కెరీర్ లో కూడా ఒక మైల్ స్టోన్ గా మిగిలిపోయింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న అనుభవాలను తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ (Ram Prasad) ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముఖ్యంగా తన కెరీర్లో తీసిన అత్యంత కీలకమైన షార్ట్ గురించి ఆ సమయంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి వెల్లడించారు.

'మురారి' షూటింగ్ సమయంలో తీసిన ఓ కీలక షాట్ తన కెరీర్‌లోనే అత్యంత సవాలుతో కూడినదని రామ్ ప్రసాద్ తెలిపారు. ఆ సీన్‌లో మహేష్ బాబు కొబ్బరి చెట్టు కింద కూర్చుంటారు. పై నుంచి అతనిపై కొబ్బరికాయలు పడాలి. ఈ షాట్ కోసం రామ్ ప్రసాద్ స్వయంగా కొబ్బరి చెట్టుపైకి ఎక్కి, ఒక చేతితో భారీ కెమెరాను ఆపరేట్ చేస్తూ, మరో చేతితో కొబ్బరి గెలను పట్టుకోవాల్సి వచ్చిందట. 'సరైన టైమింగ్‌లో కెమెరా ఆన్ చేసి, మహేష్ బాబు కదులుతున్న క్షణంలో కొబ్బరికాయలను వదలాలి. ఒక్క సెకండ్ ఆలస్యం అయినా, ఒక్క చిన్న తప్పు జరిగినా... హీరో మహేష్ బాబుకి తీవ్ర గాయం అయ్యే ప్రమాదం ఉంది'అని ఆయన గుర్తుచేసుకున్నారు.

అదే సమయంలో ఆర్ట్ డిపార్ట్‌మెంట్ కారణంగా షాట్ ఆలస్యం అవుతుండటంతో టెన్షన్ మరింత పెరిగిందట. చెట్టుపై నిలబడి ఉండగా చేతికి చెట్టు బెరడు గుచ్చి రక్తం కారిందని, చేయి లాగుతుండగా కూడా షాట్ కంప్లీట్ చేయాల్సి వచ్చిందని రామ్ ప్రసాద్ వెల్లడించారు. చివరకు దేవుడి దయతో ఒక్క టేక్‌లోనే షాట్ ఓకే అయ్యిందని చెప్పారు.

'కృష్ణవంశీ పని రాక్షసుడు'
ఈ సంఘటన గురించి మాట్లాడుతూ రామ్ ప్రసాద్.. దర్శకుడు కృష్ణవంశీని 'పని రాక్షసుడు'గా అభివర్ణించారు. అనుకున్న ఫ్రేమ్ వచ్చేవరకు ఆయన రాజీ పడరని, అదే డెడికేషన్ 'మురారి' లాంటి క్లాసిక్‌ను ఇచ్చిందని తెలిపారు. 'నా కెరీర్‌లో గురువుల దగ్గర నేర్చుకున్నది ఒకటైతే... 'మురారి' సినిమా నాకు ఓ బుక్ లాంటిది. కృష్ణవంశీ దగ్గర నేను సినిమాటోగ్రఫీని తిరిగి నేర్చుకున్నాను. ఇప్పటికీ నా పనిలో ఆయన ప్రభావం ఉంటుంది'అంటూ కృతజ్ఞతలు తెలిపారు.

టెంపుల్ షాట్ నుంచి క్రేన్ షాట్స్ వరకూ...
'మురారి'షూటింగ్ మొత్తం సవాళ్లతో నిండిందని రామ్ ప్రసాద్ చెప్పారు. షూటింగ్ మొదటి రోజే టెంపుల్ షాట్‌తో మొదలైందని, ఎక్స్‌పోజర్ సమస్యలతో ఆ సీన్ చాలా కష్టంగా పూర్తయ్యిందని గుర్తు చేసుకున్నారు. రాత్రిపూట పాత దేవాలయాలపైకి ఎక్కి లైట్లు అమర్చాల్సి వచ్చేదని, అప్పట్లో ఇప్పటిలా ఆటోమేటిక్ కెమెరాలు, జిమ్ములు లేవని వివరించారు. 100 అడుగుల ఎత్తు నుంచి కూడా కెమెరాలను మానవీయంగా ఆపరేట్ చేయాల్సి వచ్చేదని, కెమెరా ఆపరేటర్లు స్వయంగా క్రేన్‌లపై కూర్చుని భారీ కెమెరాలను నియంత్రించేవారని చెప్పారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయకర పరిస్థితులు కూడా ఎదురయ్యాయని వెల్లడించారు.

More from Filmibeat

Read more about: murali krishna vamsi mahesh babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X