స్టార్ హీరోయిన్ కూతురు టాలీవుడ్ ఎంట్రీ.. మహేష్ అన్న కొడుకు హీరోకు జోడిగా!

ఘట్టమనేని కుటుంబం నుండి మరో హీరో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు సిద్దమవుతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా టాలీవుడ్ కు పరిచయం కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను 'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి రూపొందిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌కు చెందిన అశ్వినీదత్ సమర్పణలో, చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఘట్టమనేని వారసుడితో జత కట్టే హీరోయిన్ ఎవరు? హాట్ టాపిక్ మారింది. ఇంతకీ ఆ వివరాలేంటీ?

జయకృష్ణ ఘట్టమనేని హీరోగా వస్తున్న మూవీని 'AB-4' వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారట. ఈ మూవీని తిరుపతి - చిత్తూరు నేపథ్యంలోని ఉత్కంఠభరితమైన ప్రేమకథగా తెరకెక్కుతోంది.అజయ్ భూపతి సినిమాలు ఎప్పుడూ రా అండ్ రస్టిక్ కంటెంట్‌కి ఫేమస్. ఈ మూవీని కూడా అదే జోనర్లో తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. 90వ దశకంలో మహేష్ బాబును 'రాజకుమారుడు'తో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన అశ్వినీదత్, ఇప్పుడు రమేష్ బాబు కుమారుడిని కూడా పెద్ద స్థాయిలో లాంచ్ చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశం. ఈ చిత్రానికి 'శ్రీనివాస మంగాపురం' అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం.

Mahesh Babu s Nephew Jayakrishna Debuts with Raveena Tandon s Daughter Rasha Thadani in AB 4
ఇదిలా ఉంటే.. పాన్ ఇండియా లెవెల్ లవ్ స్టోరీగా రూపొందించబడుతున్న ఈ ప్రాజెక్ట్ నుంచి తాజా ఓ కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఏమిటంటే యంగ్ హీరో జయకృష్ణ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రాషా తడానీని అధికారికంగా ప్రకటించారు. కొన్నిరోజులుగా వస్తున్న రూమర్స్‌కు చివరకు అజయ్ భూపతి టీమ్ క్లారిటీ ఇచ్చింది. 19 ఏళ్ల రాషా తడానీ ఇటీవల బాలీవుడ్‌లో 'ఆజాద్' సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే అందులోని 'ఉయ్ అమ్మా' ఐటెం సాంగ్ తో రాషా ఒక్కసారిగా నేషనల్ లెవెల్‌లో వైరల్ గా మారింది. దీంతో ఓవర్‌నైట్ స్టార్ లాగా మారింది.

ఈ అమ్మడు స్టైలిష్ లుక్స్, డ్యాన్స్ మూవ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కలిపి రాషా బాలీవుడ్‌లో నిలదొక్కుకుంటుందని భావించారు. ఈ నేపథ్యంలో ఘటమనేని వారసుడి సినిమాకి లోకి తీసుకున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. తాజాగా స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రాషా తడానీని హీరోయిన్ గా ప్రకటించడం సినిమా వర్గాల్లో చర్చనీయంగా మారింది. అయితే.. రాషా టాండన్ ను తీసుకోవడం వల్ల.. సినిమా హిందీ మార్కెట్‌కి కూడా రిలీజ్ చేసే అవకాశం లేకపోలేదు. పైగా జయకృష్ణ తొలి సినిమా నుంచే హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ కిడ్‌ను తీసుకోవడం, ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తోనట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఘట్టమనేని జయకృష్ణ తొలి మూవీలో బాలీవుడ్ హీరోయిన్ రాషా టాండన్ నటిస్తున్నట్టు మూవీ మేకర్స్ కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టర్ విడుదల చేస్తూ.. "AB-4 ప్రాజెక్ట్‌లోకి నేషనల్ సెన్సేషన్ రాషా తడానీని ఆహ్వానిస్తున్నాం. ఆమె నటనతో ప్రేక్షకులు ప్రేమలో పడతారు" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. బ్లాక్ టీ-షర్ట్, జీన్స్ తో బైక్ మీద కూర్చున్న రాషా లుక్ ఇప్పటికే వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X