For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బుల్లితెరపై మహేశ్ బాబు అరుదైన రికార్డు: ఏడోసారి కూడా ఈ రేంజ్‌లో అంటే నమ్మలేరు

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. వారిలో ఒక్కొక్కరికీ ఒక్కో శైలి ఉంది. అందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆరంభం నుంచి తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నాడు. కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. యాక్టింగ్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో మహేశ్ బాబు హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ స్టార్ హీరో అదిరిపోయే ఘనతను అందుకుని తన సత్తాను మరోసారి నిరూపించుకున్నాడు.

  Bigg Boss: బయటపడిన రవి బండారం.. లహరి విషయంలో ప్రియ అన్నది నిజమే.. షాకిస్తోన్న వీడియో

  'భరత్ అనే నేను', 'మహర్షి' వంటి భారీ హిట్ల తర్వాత.. సూపర్ స్టార్ మహేశ్ బాబు - సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో వచ్చిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. గత సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అదే సమయంలో కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతేకాదు, విడుదలైన అన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టి ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఈ మూవీ విజయంతో మహేశ్ బాబు ఖాతాలో హ్యాట్రిక్ నమోదైంది. థియేటర్లలో సత్తా చాటిన 'సరిలేరు నీకెవ్వరు' బుల్లితెరపైనా అదిరిపోయే స్పందనను అందుకుని హవాను చూపించింది.

  గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం అయిన 'సరిలేరు నీకెవ్వరు' మూవీ రికార్డు స్థాయిలో 29.40 రేటింగ్‌ సాధించింది. తద్వారా అత్యధిక రేటింగ్ అందుకున్న తెలుగు సినిమాల జాబితాలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. అంతేకాదు, రెండో సారి ప్రసారం అయినప్పుడు 17.40 రేటింగ్ అందుకుంది. దీంతో 2020 టీఆర్పీ రేటింగ్ లిస్టులో మూడో స్థానంలో నిలిచింది. మూడోసారి వచ్చినప్పుడు 12.55, నాలుగో సారి 10.18, ఐదో సారి 6.41, ఆరోసారి 5.11 రేటింగ్‌ను అందుకుంది. ఇలా ప్రసారం అయిన ప్రతిసారీ మంచి రెస్పాన్స్‌ను రేటింగ్‌ను సొంతం చేసుకుంది.

  Bigg Boss: షోలో చెండాలమైన పని చేసిన హమీదా.. పర్సనల్ ఫొటోలను లీక్ చేసి ఝలక్ ఇచ్చిన ఫ్యాన్స్

  Mahesh Babus Sarileru Neekevvaru Got 6.83 TRP Rating in 7th Time

  ఇక, ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' మూవీ ఏడోసారి బుల్లితెరపై ప్రసారం అయింది. దీనికి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. ఫలితంగా ఈ సారి మరింతగా పుంజుకుని 6.83 టీఆర్పీ రేటింగ్‌ను దక్కించుకుంది. దీంతో ఈ సినిమా అప్పటికీ ఇప్పటికీ హవాను చూపిస్తూనే ఉంది. ఇక, 'సరిలేరు నీకెవ్వరు' మూవీ ఏకంగా ఏడు సార్లు ఐదు అంతకంటే ఎక్కువ రేటింగ్‌ను అందుకోవడంతో మహేశ్ బాబు పేరిట అరుదైన రికార్డు వచ్చి చేరింది. దీనిపై సూపర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అదే సమయంలో ఈ రికార్డును సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ పోస్టులు పెడుతున్నారు.

  ఇదిలా ఉండగా.. 'సరిలేరు నీకెవ్వరు' మూవీని అనిల్ రావిపూడి తెరకెక్కించగా.. దిల్ రాజు, అనిల్ సుంకరతో కలిసి మహేశ్ బాబు స్వయంగా నిర్మించాడు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. అలాగే, ఇందులో విజయశాంతి, ప్రకాశ్ రాజ్, సంగీత, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, కౌముది, ఆద్య తదితరులు కీలక పాత్రలు చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇదిలా ఉండగా, ప్రముఖ డిజిటల్ మీడియా దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోలో సైతం ఈ మూవీకి భారీ స్థాయిలో వ్యూస్ వచ్చిన విషయం తెలిసిందే.

  English summary
  Tollywood Superstar Mahesh Babu Did Sarileru Neekevvaru Under Anil Ravipudi Direction. Now This Movie Got 6.83 TRP Rating in 7th Time
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X