మహేశ్ బాబుకు బిగ్ షాక్: ‘సర్కారు వారి పాట’ షూటింగ్ స్పాట్ పిక్స్ లీక్

తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతూ టాప్ హీరోగా వెలుగొందుతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఇటీవలి కాలంలో 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి సూపర్ డూపర్ హిట్లతో హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్న అతడు.. ప్రస్తుతం కుటుంబ కథా చిత్రాల దర్శకుడు పరశురాం తెరకెక్కిస్తోన్న 'సర్కారు వారి పాట'లో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రకటన ఎప్పుడో వెలువడినప్పటికీ.. కరోనా లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ మాత్రం ప్రారంభం అవలేదు. అయితే, ఇప్పుడు పరిస్థితులు మారడంతో ఇటీవలే చిత్రీకరణను మొదలు పెట్టారు.

మొదటి షెడ్యూల్‌లో భాగంగా 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. అక్కడి ఎడారుల్లో ఛేజింగ్ యాక్షన్ సీన్స్ షూట్ చేసిన చిత్ర యూనిట్.. హీరో హీరోయిన్లపైనా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించింది. అలాగే, అక్కడే ఓ పాటను కూడా తీయబోతున్నారని తెలుస్తోంది. అక్కడి షూటింగ్ విశేషాలను వెల్లడిస్తూ.. 'ఇక్కడి హోటల్‌లో మాకు ఘనమైన స్వాగతం దక్కింది. దీనికి గానూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు' అంటూ మహేశ్ కొద్ది సేపటి క్రితమే ట్వీట్ చేశాడు. ఆ వెంటనే సినిమా షూటింగ్ స్పాట్‌లోని ఓ పిక్ బయటకు వచ్చింది.

Mahesh Babus Sarkaru Vaari Paata Shooting Spot Photo Leaked

దుబాయ్‌లోని ఎడారిలో యాక్షన్ సీక్వెన్ చేస్తున్న సమయంలో మహేశ్ బాబు నడుచుకుంటూ వెళ్తున్న పిక్ ఒకటి తాజాగా లీకైంది. ఇందులో అతడు బ్లాక్ షర్ట్‌తో పాటు కొత్త హెయిర్ స్టైల్‌తో కనిపిస్తున్నాడు. దీంతో ఈ ఫొటో కొద్ది సమయంలోనే వైరల్ అయిపోయింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ దీనికి సంగీతం సమకూర్చుతున్నాడు. వచ్చే సంక్రాంతికి ఇది విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X