పాకిస్తాన్ అమ్మాయితో గౌతమ్ ఘట్టమనేని చెట్టాపట్టాలు .. పబ్లిక్‌గా ఆమెతో అలా!

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది పర్యాటకులను పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కిరాతకంగా కాల్చి చంపడంతో దేశం రగిలిపోతున్న సంగతి తెలిసిందే. ఐడీ కార్డులు చెక్ చేసి, మతం గురించి అడిగి మరి తమ వారిని టెర్రరిస్టులు కాల్చి చంపారంటూ బాధితులు చెప్పడంతో భారతీయులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఉగ్రవాదులకు దాని వెనుకున్న పాకిస్తాన్‌కు సరైన బుద్ధి చెప్పాలంటూ దేశ ప్రజలు కేంద్రాన్ని కోరుతున్నారు. పహల్గామ్ ఘటన తర్వాతి నుంచి వరుస సమావేశాలతో ప్రధాని మోడీ బిజీగా ఉన్నారు. అటు ఇరు దేశాలు సరిహద్దుల్లో యుద్ధ సన్నాహాలు చేస్తుండటంతో భారత్ - పాకిస్తాన్‌ల మధ్య ఏం జరుగుతుందోనని టెన్షన్ నెలకొంది.

mahesh Babus son Gautam Ghattamaneni with a pakistani girl video sparks controversy

భారత్ దెబ్బకు వణికిపోతోన్న పాకిస్తాన్

సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని.. సంయమనం పాటించాలని అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే భారత్ - పాకిస్తాన్‌లకు సూచించారు. అయితే పహల్గామ్ దాడికి కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు తేల్చిచెబుతున్నారు. భారత్ 36 గంటల్లో దాడికి దిగుతుందని ఆ దేశ మంత్రి స్వయంగా చెప్పారంటే ఇండియా దెబ్బకు పాకిస్తాన్ ఎలా భయపడుతుందో చెప్పొచ్చు. మరోవైపు.. పహల్గామ్ దాడిపై విచారణను కేంద్రం ముమ్మరం చేసింది.

సూత్రధారి లష్కరే తోయిబానే

కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి శాటిలైట్ ఇమేజ్‌లు, బాధితుల స్టేట్‌మెంట్, డ్రోన్ దృశ్యాలు, గుర్రపు స్వారీ ఆపరేటర్లు, తదితర ఆధారాల ఆధారంగా ఎన్ఐఏ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. బైసరన్ లోయలో ఈ పాశవిక దాడిని కాశ్మీర్ కేంద్రంగా పనిచేస్తోన్న ది రిసెస్టిన్స్ ఫ్రంట్ అమలు చేసినా.. ఈ దాడికి కర్త , కర్మ , క్రియ అన్ని లష్కరే తోయిబానే అని ఎన్ఐఏ అనుమానిస్తోంది. పహల్గామ్ దాడితో సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. భారత్ సంయమనం పాటిస్తున్నా పాక్ సైన్యం కవ్విస్తుండటంతో భారత దళాలు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నాయి.

పాకిస్తాన్ నటులపై భారతీయుల ఆగ్రహం

పహల్గామ్ దాడి తర్వాతి నుంచి పాకిస్తాన్ నటులపై భారత్‌లో తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సహా భారతీయ చిత్ర పరిశ్రమల్లో పనిస్తున్న వారిపై నిషేధంతో పాటు భవిష్యత్తులో వీరికి అవకాశాలు ఇవ్వకూడదని పరిశ్రమ నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. పాక్ జాతీయులు దేశం విడిచి వెళ్లిపోవాలన్న భారత ప్రభుత్వ నిర్ణయంతో పలువురు ఇప్పటికే వాఘా - అట్టారీ బోర్డర్ ద్వారా సరిహద్దులు దాటారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ఫౌజీలో పాకిస్తాన్ మూలాలున్న ఇమాన్వీ ఇస్మాయిల్ నటించడంపైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనికి ఆమె వివరణ ఇచ్చుకున్నారు కూడా.

పాకిస్తాన్ అమ్మాయితో మహేశ్ కుమారుడి వీడియో

ఇలాంటి ఉద్రిక్త పరిస్ధితుల్లో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని వివాదంలో చిక్కుకున్నారు. త్వరలో హీరోగా వెండితెరపై అడుగుపెట్టడానికి రెడీ అవుతున్న గౌతం.. గత కొంతకాలంగా విదేశాల్లో చదువుకుంటూనే శిక్షణలో ఓనమాలు దిద్దుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అక్కడి విశేషాలను గౌతమ్ పంచుకుంటూ ఉంటారు. తాజాగా టీమిండియా క్రికెట్ జెర్సీని ధరించి ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో పాకిస్తాన్ క్రికెట్ జెర్సీని ధరించి ఓ అమ్మాయి ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చూస్తుంటే ఇదొక షార్ట్ ఫిల్మ్‌లా ఉంది.

గౌతమ్ ఘట్టమనేనిపై ట్రోలింగ్

అందులో వీరిద్దరూ తమ మిత్రులతో కలిసి భారత్ - పాక్ మ్యాచ్‌ను చూసి బయటికొస్తారు. అనంతరం ఆ అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఇద్దరూ కలిసి ఓ పార్క్‌కు వెళ్తారు. అక్కడ ఆ అమ్మాయి తన చేతిలో ఉన్న ఓ కేక్‌లాంటి వంటకాన్ని అతనితో కలిసి షేర్ చేసుకుంటుంది. అనంతరం ఇద్దరూ కలిసి పార్క్‌లో ఆడుకుంటారు. ఆ అమ్మాయి వెళ్తూ వెళ్తూ ఫ్లైట్ టికెట్ చేతిలో పెడుతుంది. భారత్ - పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నెటిజన్లు దీనిపై ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. మరి దీనిపై గౌతమ్ ఆయన తండ్రి మహేశ్ బాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X