వావ్.. మరోసారి డ్యాన్స్‌తో అదరగొట్టిన మహేష్ కూతురు
సోషల్ మీడియాలో కేవలం స్టార్స్ అనే కాకుండా వారి పిల్లలు కూడా ఈ మధ్య కాలంలో భారీ స్థాయిలో ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. ముఖ్యంగా ఘట్టమనేని వారి అమ్మాయి సితార ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మహేష్ తన కూతురి టాలెంట్ ని చూసి చాలా మురిసిపోతుంటాడు. గతంలో ఎన్నో రకాల వీడియోలతో సితార సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఇక లేటెస్ట్ గా మరోసారి సితార పాప తన డ్యాన్స్ స్కిల్స్ తో సరికొత్తగా ఆకట్టుకుంది. హిందు శాస్త్రీయ నాట్యంలో ఇప్పటికే పలు శిక్షణలు తీసుకున్న సితార ఇప్పుడు వెస్టర్న్ కంట్రీ ఫ్యాషన్ డ్యాన్స్ కూడా అదే రేంజ్ లో చేస్తోంది. ఇటీవల నమ్రత తన గారాల కూతురు చేసిన డ్యాన్స్ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడే సితార ఈ రేంజ్ లో స్టెప్పులు వేస్తోంది అంటే ముందు ముందు ఇంకా హై రేంజ్ లో అదరగొడుతుందని చెప్పవచ్చు.

గతంలోనే చాలా సార్లు సితార తన డ్యాన్స్ స్కిల్ లో నెటిజన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. అంతే కాకుండా మహేష్ సినిమాలకు సంబంధించిన పాటలను పాడుతూ అభిమానులకు మరింత ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది. చూస్తుంటే సితార భవిష్యత్తులో వెండితెరకి ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదంటూ నెటిజన్స్ పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. గతంలో సితార మహేష్ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు రూమర్స్ బాగానే వచ్చాయి. కానీ ఘట్టమనేని ఫ్యామిలీ ఆ రూమర్స్ ని పట్టించుకోలేదు.
View this post on InstagramMy little dancer baby♥️♥️♥️ @sitaraghattamaneni
A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on


Click it and Unblock the Notifications











