రష్మిక మందన్నపై మహేష్ ఫ్యాన్స్ ఫైర్ .. అంతలా ఏం చేసిందంటే..
ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నానే అని చెప్పాలి. కాగా రష్మికా వరుస సెన్సేషనల్ హిట్స్‌తో తెలుగు మార్కెట్‌లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో పలు సినిమాలు చేస్తూ ఫుల్ గా బిజీగా ఉంది.
కాగా రష్మిక హీరోయిన్‌గా బాగానే సెటిల్ అయ్యినప్పటికీ మిగతా హీరోయిన్స్ నుంచి వేరు చేసేలా మంచి స్టార్డం ఉన్నప్పటికీ.. అదే ఇతర హీరోయిన్స్ నుంచి ఈమెని మరో విషయంలో కూడా సెపరేట్ చేస్తుంది. రష్మికకి సినీ పరిశ్రమలో ఎన్ని హిట్స్ తో మంచి ట్రాక్ రికార్డు ఉందో అదే విధంగా సోషల్ మీడియాలో కూడా పలు ట్రోల్స్, విమర్శలను తాను ఎప్పటి నుంచో ఎదుర్కొంటూ వస్తుంది.

తన లుక్స్ పరంగా కూడా ట్రోల్స్ పడేవి. రీసెంట్ గానే పుష్ప 2 ప్రమోషన్స్ లో తన లుక్ చూసి చాలా మంది మైఖేల్ జాక్సన్ లా ఉందంటూ కామెంట్స్ చేశారు. ఈ తర్వాత పీలింగ్స్ సాంగ్ లో తన హాట్ చూసి కూడా చాలా కామెంట్స్ వచ్చాయి. ఇలా రష్మిక విషయంలో మాత్రం ఎప్పటికపుడు ఏదొక అంశం సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. కానీ లేటెస్ట్ గా మహేష్ అభిమానుల ఆగ్రహానికి రష్మిక గురయ్యింది.
తాను రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు మర్చిపోయింది. ఆమెకి తాను లైఫ్ లో చూసిన మొదటి సినిమా ఏది అంటే తమిళ సూపర్ హిట్ చిత్రం "ఘిల్లి" అని చెప్పుకొచ్చింది. నేను ఎప్పుడు నుంచో దళపతి విజయ్ ఫ్యాన్ అని ఆ సినిమానే మొదట చూసాను అని చెప్పింది. కానీ ఈ చిత్రం మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాకి రీమేక్ అని తర్వాత తెలిసిందని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పేసింది రష్మిక.

దీనితో ఈ పాయింట్ సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పింది. మహేష్ బాబు సినిమా "ఒక్కడు" కి రీమేక్ గా "ఘిల్లి"ని విజయ్ చేశారని.. దానిని కూడా రష్మిక ఇలా మార్చేయడం బాలేదు అంటూ సూపర్‌స్టార్ అభిమానులు మండిపడుతున్నారు. మినిమమ్ ఓ తెలుగు స్టార్ సినిమాల గురించి ఐడియా లేదు అన్నట్టుగా ఏకీపారేస్తున్నారు. అలాగే ఇతర నెటిజన్స్ కూడా రష్మిక ఇలా అనేసింది ఏంటి అని కూడా నవ్వుకుంటున్నారు.
నిజానికి విజయ్ .. మహేష్ బాబు చేసిన పోకిరి సినిమాని కూడా రీమేక్ చేసి తమిళ్ లో హిట్ కొట్టాడు. మరి రష్మిక ఆ రెండు సినిమాల విషయంలో కన్ఫ్యూజ్ అయ్యిందో ఏమో కానీ ఇపుడు ఇలాంటి సమాధానం చెప్పి బుక్కయ్యిపోయింది. ఘిల్లి సినిమా నుంచి చార్ట్ బస్టర్ సాంగ్ అపిడి పోడే పోడే సాంగ్ కి చాలా సార్లు డాన్స్ చేశాను అంటూ కూడా చెప్పుకొచ్చింది. మరి మహేష్ బాబుతో కూడా సరిలేరు నీకెవ్వరు అనే సినిమా చేసింది కానీ మహేష్ బాబు ఏయే సినిమాలు చేసాడో అనేది రష్మికకు తెలియకపోవడం మాత్రం ఆశ్చర్యకరం.


Click it and Unblock the Notifications











