Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ అభిమానులను ఈ సారి ఉహించని షాక్ ఇచ్చిన వార్నర్
ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎప్పుడు లేని విధంగా ఇండియన్ స్టార్ హీరోల అభిమానులను తన టిక్ టాక్ వీడియోలతో ఎట్రాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలను టార్గెట్ చేస్తూ వారి అభిమానులను బాగానే ఆకర్షిస్తున్నాడు. ఐపిఎల్ లేకపోయినా కూడా తెలుగు ఆడియెన్స్ ని తన టిక్ టాక్ వీడియోస్ తో సరికొత్తగా ఆకట్టుకుంటున్నాడు.
బుట్ట బొమ్మ అంటూ మొన్న స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ ని ఆకట్టుకున్న ఈ క్రికెటర్ ఆ తరువాత మహేష్, ప్రభాస్ బెస్ట్ డైలాగ్స్ తో మెప్పించిన విషయం తెలిసిందే. అలాగే డేవిడ్ వార్నర్ నందమూరి అభిమానులను కూడా ఎట్రాక్ట్ చేసే విధంగా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా వార్నర్ తన భార్యతో కలిసి జనతా గ్యారేజ్ ఐటెమ్ సాంగ్ స్టెప్పులు కూడా వేశాడు. నేను పక్కా లోకల్ అంటూ భార్యతో కలిసి నెటీజన్స్ కి మంచి కిక్కిచ్చాడు. ఇక ఇప్పుడు మహేష్ అభిమానులకు మరొసారి కిక్కిస్తాడు అనుకుంటే ఊహించని షాక్ ఇచ్చాడు.
సరిలేరు నికెవ్వరు సినిమాలోని మైండ్ బ్లాక్ సాంగ్ కి డ్యాన్స్ చేస్తాడు అనుకుంటే దెబ్బకు మాయమైపోయాడు. వార్నర్ ఆ డ్యాన్స్ చేస్తే బావుండదని నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూస్తుంటే ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ మన ఆడియెన్స్ మనసులో ఒక స్పెషల్ బ్రాండ్ సెట్ చేసుకుంటున్నాడు అనిపిస్తోంది. ఐపీఎల్ సన్ రైజర్స్ జట్టును నడిపించే వార్నర్ ఈ సారి తెలుగు హీరోల సాంగ్స్ తో అద్భుతంగా ఆకట్టుకోవడం బావుంది.