twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దర్శకుడిగా మారిన యాక్టింగ్ గురు.. మహేష్ గంగిమల్ల ‘అభివ్యక్తి’ ప్రారంభం

    |

    ఇంత వరకు తెరకు ఎంతో మంది నటీనటులు, హీరోహీరోయిన్లను పరిచయం చేసిన మహేష్ గంగిమల్ల చివరకు కొత్త చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్దమయ్యారు. స్వీయ దర్శకత్వంలో నటిస్తోన్న ఈ సినిమాకు అభివ్యక్తి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. యాక్టింగ్ రీసర్చ్ సెంటర్ స్థాపించి ఎంతో మంది హీరో, హీరోయిన్లను , నటీనటులను సినీ పరిశ్రమకు అందించిన యాక్టింగ్ గురు మహేశ్ గంగిమల్ల సరికొత్త పాత్రను టాలీవుడ్‌లో పోషించేందుకు సిద్దమయ్యారు.

    మహేష్ గంగిమల్ల తన స్వీయ దర్శకత్వంలో అభినయ జ్ఞాపిక ప్రొడక్షన్‌లో అభివ్యక్తి అనే టైటిల్‌తో కొత్త సినిమా రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాత , కొత్త నటీనటుల కలయికతో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో లలిత్ ఆదిత్య, మల్లేశం ఫేమ్ అనన్య నాగళ్ల , సాయి రాఘవేంద్ర, సుందర్, రమణ నటిస్తున్నారు. జైపాల్ సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు. ఇక మల్లేశం ఫేమ్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. స్క్రిప్ట్ గురించి ముందే తెలుసు కాబట్టి , ఈ మంచి సినిమా కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నా అని అన్నారు.

    Mahesh Gangimalla Abhivyakti Opening Ceremony

    జనవరి నుంచి షూటింగ్ ప్రారంభించబోతున్నామని, ఈ సినిమాలో తన స్టూడెంట్స్‌తో‌పాటు, కొత్త వారికోసం త్వరలో టాలెంట్ హంట్ అనే ప్రోగ్రాం చేయబోతున్నామని మహేశ్ గంగిమల్ల తెలిపారు. అభివ్యక్తి చిత్రానికి అజగవా ఆర్ట్స్ నిర్మాత భూపాల్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, హీరో రాకేశ్ వర్రే క్లాప్ కొట్టాడు, యువ దర్శకుడు మాధవ్ కోదాడ్ గౌరవ దర్శకత్వం వహించారు. తమ గురువే తమ దర్శకుడు కావడం తమకెంతో సంతోషంగా ఉందని ఇతర నటీనటులు తెలిపారు.

    English summary
    Mahesh Gangimalla Abhivyakti Opening Ceremony.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X