ఈ వీడియో చూశారా? మహేష్ అభిమానులను సర్ ప్రైజ్ చేసిన వర్మ!
దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో షేర్ చేసిన ఓ వీడియో మహేష్ బాబు అభిమనులను సర్ ప్రైజ్ చేసింది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు(మే 31)ని పురస్కరించుకుని వర్మ ఈ పోస్ట్ పెట్టారు. మహేష్ బాలనటుడిగా చేసిన సినిమాలోని ఈ క్లిప్ ఎక్కడ సంపాదించాడో కానీ... సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది.
ఇందులో మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ అభిమానిగా నటించారు. ఓ పత్రిక ఆఫీసుకు వచ్చిన 'గుడ్ మార్నింగ్ ఎడిటర్. నా పేరు మహేష్ బాబు, టెన్త్ క్లాస్... ఆల్ ఇండియా కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మే 31 మా హీరో పుట్టినరోజు సందర్భంగా మీ పత్రికలో ఒక ఫెంటాస్టిక్ అనుబంధం వేయించాలనుకుంటున్నాం.' అని చెప్పే ఈ సీన్ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

మహేష్ బాబు పుట్టుకతోనే సూపర్ స్టార్ అంశతో పుట్టాడు. ఆయనలో ఆ టాలెంట్ ఉంది కాబట్టే ఈ స్థాయికి వచ్చాడు. అందుకే మహేష్ రియల్ సూపర్ స్టార్ అంటూ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు. వర్మ చేసిన ఈ పోస్టుకు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.
'మహర్షి'తో మరో భారీ విజయం తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు తర్వరలో 'ఎఫ్ 2' ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇది మహేష్ బాబు కెరీర్లో 26వ చిత్రం కాగా... ఈ ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న తొలి చిత్రం. మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినిమా లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.


Click it and Unblock the Notifications











