Mahesh Kathi Accident News: మూడు రోజులు కోమాలో, పూర్తి వివరాలు వెల్లడించిన డైరెక్టర్!
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన కత్తి మహేష్ కి సంబంధించిన కీలక వివరాలు కొద్ది సేపటి క్రితం వెల్లడయ్యాయి. ఆయన స్నేహితులు సినిమా రంగానికి చెందిన దర్శకుడు సాయి రాజేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ సిద్ధారెడ్డిలు కత్తి మహేష్ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు వివరాల్లోకి వెళితే.
Recommended Video

సోషల్ మీడియా వేదికగా
టాలీవుడ్ లో ప్రముఖ విమర్శకుడిగా, దర్శకుడిగా, నటుడిగా ఇలా అనేక రంగాల్లో తన ప్రతిభను చాటుకున్న కత్తి మహేష్ ఈ రోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ఆయన రోడ్డు ప్రమాదానికి సంబంధించి కొన్ని వివరాలను వెంకట్ సిద్ధారెడ్డి తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

అపస్మారక స్థితిలో
మహేష్ కత్తికి ఈ ఉదయం నెల్లూరు సమీపంలో ప్రమాదం జరిగిందని, నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ లో ప్రస్తుతం మెకానికల్ వెంటిలేషన్ మీద ఆయన ఉన్నాడని వెంకట్ వెల్లడించారు. ఆయన తలకు ఇంజురీ ఉందని, ఎడమ కన్ను దాదాపు దెబ్బతిందని వెంకట వెల్లడించారు. అంతే కాక ముఖానికి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయని అపస్మారక స్థితిలో ఉండగానే హాస్పిటల్లో చేర్చారని ఆయన చెప్పుకొచ్చారు.

గ్లాస్గో కోమా స్కేల్ ఎంతంటే
డాక్టర్లు పరీక్షలు చేసి జి.సి.ఎస్ (గ్లాస్గో కోమా స్కేల్)- కంటి కదలిక, మాట, కండరాల కదలికను బట్టి 3/15 గా అంచనా వేశారు. మెదడుకు అయిన గాయాన్ని 'డిఫ్యూజ్ యాక్జోనల్ ఇంజూరీ' అంటున్నారు. ప్రస్తుతం ముఖం, కంటి చుట్టూ అయిన గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ జరుగుతోందని వెల్లడించారు. బ్రెయిన్ సర్జరీ కూడా అవసరం కావచ్చు అని అంచనా వేస్తున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు.

ఫోన్ లు చేస్తున్నారు
ఇప్పటికే చాలామంది ఫోన్ చేసి అవసరమైతే ఆర్ధికంగా కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారని అలాంటి అవసరం వచ్చినప్పుడు కచ్చితంగా అందరి సహాయం తీసుకుంటామని వెంకట్ వెల్లడించారు. మహేష్ జీవితంలో చాలా సవాళ్లు ఎదుర్కొన్నారని, ఈ సవాలును కూడా ఎదుర్కొని స్వస్థతతో తప్పక తిరిగి రావాలని మిత్రులు అభిలషిస్తున్నారు అని చెప్పుకొచ్చారు.

ఫోటోలు పెట్టకండి
ఈలోగా దయచేసి మహేష్ హాస్పిటల్ లో ఉన్న ఫోటోలు పెట్టకండి ఎప్పటికప్పుడు మాకు తెలిసిన సమాచారాన్ని మీ అందరికీ తెలియజేస్తామని వెంకట్ తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇక సాయి రాజేష్ కూడా మహేష్ కత్తి పరిస్థితి ప్రమాదకరంగానే ఉందని ప్రస్తుతం కోమాలోనే ఉన్నాడు అని వెల్లడించారు. ఒక కన్ను పూర్తిగా దెబ్బతిందని మరో కన్ను ఆపరేషన్ చేస్తే కానీ పరిస్థితి చెప్పలేము అంటున్నారు అని వెల్లడించారు.

పరిస్థితులు అనుకూలిస్తే
అంతేకాక బ్రెయిన్ లో కూడా కొంత దెబ్బతిందని మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. పరిస్థితులు అనుకూలిస్తే చెన్నైలోని శంకర్ నేత్రాలయ హాస్పిటల్ కు తరలిస్తారని అంటున్నారు. మూడు రోజులు గడిస్తే గానీ పూర్తి సమాచారం ఇవ్వలేమని డాక్టర్లు చెప్పారు అని వెల్లడించారు.


Click it and Unblock the Notifications











