హిప్పీ దర్శకుడిపై కత్తి మహేష్ షాకింగ్ కామెంట్స్..

Recommended Video

Kathi Mahesh Satirical Comments On Hippi Movie Director || Filmibeat Telugu

కత్తి మహేష్ అంటేనే ఓ సెన్సేషన్. ఫిలింక్రిటిక్‌గా చెప్పుకునే ఆయన.. అప్పట్లో పవన్ కళ్యాణ్, ఆయన ఫాన్స్‌పై ఆయన కత్తి మహేష్ రేపిన దుమారం ఎప్పటికీ మరచిపోలేము. ఆ మధ్య ఏ మీడియా ఇంటర్వ్యూలో చూసినా కత్తి మహేషే దర్శనమిచ్చేవాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ తర్వాత సైలెంట్‌గా ఉన్న కత్తి మహేష్ తాజాగా మళ్లీ తన కత్తికి పదును పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై వరుస ట్వీట్స్ చేస్తూ రెచ్చిపోతున్న ఆయన.. తాజాగా ''ఆ హాఫ్ నాలెడ్జ్ దర్శకులకి దాని అర్థం చెప్పండి'' అంటూ పరోక్షంగా 'హిప్పీ' మూవీ డైరెక్టర్‌పై వివాదాస్పద కామెంట్ చేశాడు.

లివ్-ఇన్ రిలేషన్షిప్ నేపథ్యంలో హిప్పీ

లివ్-ఇన్ రిలేషన్షిప్ నేపథ్యంలో హిప్పీ

లివ్-ఇన్ రిలేషన్షిప్ నేపథ్యంలో నేటి యువతరానికి కావాల్సిన అన్ని అంశాలు జోడించి 'హిప్పీ' మూవీని తెరకెక్కించారు డైరెక్టర్ టీఎన్ కృష్ణ. తన సినిమాలో ఈ జనరేషన్, ఈ కాలం ప్రేక్షకులు అంగీకరించేలానే రొమాన్స్ ఉంటుందని విడుదలకు ముందే ప్రకటించిన టీఎన్ కృష్ణ.. అన్నట్లుగానే హిప్పీలో రొమాన్స్ పంట పండించారు.

యూత్ టార్గెట్‌గా..

యూత్ ని టార్గెట్ చేస్తూ నేటితరం యువతలో లవ్, రొమాన్స్, సెక్స్, లివ్-ఇన్ రిలేషన్షిప్ (సహజీవనం) వంటి అంశాలు ఏ స్టేజ్‌లో ఉన్నాయనేది చూపిస్తూ.. మరో పదేళ్లకు ఈ ప్రేమలు, పెళ్లిళ్లు ఏమవుతాయి? అలాగే సహజీవనం ఎలా ఉండనుంది అనే పెయిన్ బేస్ చేసుకొని బోల్డ్ సన్నివేశాలతో యూత్ ఆడియన్స్‌కి కిక్కిచ్చే సినిమా రూపొందించారు డైరెక్టర్ టీఎన్ కృష్ణ.

టార్గెట్ చేసిన కత్తి.. ఏమన్నాడంటే..

టార్గెట్ చేసిన కత్తి.. ఏమన్నాడంటే..

అయితే ఈ సినిమా చూసిన కత్తి మహేష్.. హిప్పీ డైరెక్టర్‌ని టార్గెట్‌ చేస్తూ సోషల్ మీడియా వేదికగా సెన్సేషనల్ షార్ట్ రివ్యూ పోస్ట్ చేశాడు. ''లివ్-ఇన్ రిలేషన్షిప్ అంటే ఒక ఆడా, మగా జంట కలిసి వేరువేరు బెడ్రూమ్ లలో బ్రతకడం కాదు. ఫుడ్డు-బెడ్డు కూడా కలిసి పంచుకుని ఒక ఇంట్లో జీవించడం. పెళ్లి కాకుండానే మొగుడూ పెళ్లాల లాగా సంసారం చెయ్యడం.. ఈ పిచ్చి హాఫ్ నాలెడ్జ్ దర్శకులకి ఈ విషయం ఎవరైనా చెప్పండయ్యా!'' అంటూ తన ఫీలింగ్ బయటపెట్టాడు.

దర్శకుల పేర్లేవి అనేది కత్తి మహేష్ చెప్పకపోయినా.. తాజాగా లివ్-ఇన్ రిలేషన్షిప్ నేపథ్యంలో వచ్చిన సినిమా హిప్పీ మాత్రమే కాబట్టి ఆయన ఇన్‌డైరెక్ట్‌గా అన్నది టీఎన్ కృష్ణనే అని తెలుస్తోంది. ఎవరు ఆ హాఫ్ నాలెడ్జ్ డైరెక్టర్ ? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ఈ రోజు ఓ సినిమా చూశాలే! అని బదులిచ్చాడు కత్తి మహేష్. దీంతో కత్తి పెట్టిన ఆ పోస్ట్ హిప్పీ సినిమాను ఉద్దేశించే అని కన్ఫర్మ్ అయిపోయింది.

విడుదలకు ముందు హిప్పీ దర్శకుడి మాట..

విడుదలకు ముందు హిప్పీ దర్శకుడి మాట..

నా జీవితంలోని, నా స్నేహితుల లైఫ్‌లోని కొన్ని సంఘటనలు, అనుభూతుల నుంచి హిప్పీ సినిమా కథ పుట్టింది. అలాగా అని నా బయోపిక్ కాదు. కార్తీకేయ, జెడీ చక్రవర్తి క్యారెక్టర్లలో నన్ను నేను చూసుకొన్నాను. చిత్రంలోని ఎమోషనల్ పాయింట్‌ కథను నడిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరి రిలేషన్ షిప్‌లో ఎలాంటి అనర్థాలు చోటుచేసుకొంటున్నాయనేది చూపిస్తాం. ఈ సినిమాలో ఓ ఫిలాసఫికల్ పాయింట్ అందర్నీ ఆకట్టుకుంటుంది అని డైరెక్టర్ టీఎన్ కృష్ణ అన్నారు

హిప్పీ మూవీ..

హిప్పీ మూవీ..

RX100 సినిమాతో అందర్ని ఆకట్టుకొన్న హీరో కార్తీకేయ హిప్పీ చిత్రంలో హీరోగా నటించాడు. టీఎన్ కృష్ణ ఈ చిత్రానికి డైరెక్టర్‌గా వ్యవహరించారు. ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్మించారు. దిగంగన సూర్యవన్షీ, జేడీ చక్రవర్తి తదితరులు కీలక పాత్రలు పోషించారు. RX 100 ఫేం ఆర్డీ రాజశేఖర్ సంగీత దర్శకుడిగా, ప్రవీణ్ కేఎల్ ఎడిటర్‌గా పనిచేశారు. జూన్ 6వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X