మహేశ్ బాబు ఖాతాలో అరుదైన రికార్డు: ఈ ఘనత అందుకున్న మొదటి సినిమాగా ‘సరిలేరు’
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. గత ఏడాది అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'సరిలేరు నీకెవ్వరు'తో భారీ విజయాన్ని అందుకున్న ఈ స్టార్ హీరో.. 'భరత్ అనే నేను', 'మహర్షి'తో కలిపి హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఎన్నో అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా.. మొదటి ఆట నుంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి జైత్రయాత్ర కొనసాగించిన ఈ మూవీ విడుదలైన అన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టి ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది.
వెండితెరపై సత్తా చాటిన 'సరిలేరు నీకెవ్వరు'.. బుల్లితెరపైనా తన హవాను చూపించింది. తద్వారా గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం అయిన ఈ మూవీ రికార్డు స్థాయిలో 29.40 రేటింగ్ సాధించింది. తద్వారా అత్యధిక రేటింగ్ అందుకున్న తెలుగు సినిమాల జాబితాలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. అంతేకాదు, రెండో సారి ప్రసారం అయినప్పుడు 17.40 రేటింగ్ అందుకుంది. దీంతో 2020 టీఆర్పీ రేటింగ్ లిస్టులో మూడో స్థానంలో నిలిచింది. దీంతో మహేశ్ బాబు స్టామినా మరోసారి నిరూపణ అయినట్లైంది.

ఇదిలా ఉండగా.. 'సరిలేరు నీకెవ్వరు' ఇటీవల మరోసారి బుల్లితెరపై ప్రసారం అయింది. ఈ సారి దానికి 12.55 రేటింగ్ వచ్చింది. ఇక, తాజాగా టెలివిజన్‌పై కనువిందు చేసిన ఈ మూవీ 10.18 రేటింగ్‌ను సంపాదించింది. దీంతో ఏకంగా నాలుగు సార్లు పది పైచిలుకు రేటింగ్ సాధించిన మొదటి తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. మరోవైపు, సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ దుబాయ్‌లో జరుగుతోంది.


Click it and Unblock the Notifications











