సితార ఏడ్చేసింది.. అప్పుడు వేరు ఇప్పుడు వేరు: మహేష్ బాబు

Recommended Video

Mahesh Babu Reveals His Kids Reaction After Watching Maharshi || Filmibeat Telugu

సూపర్ స్టార్ మహేష్ బాబు వృత్తిపరంగా ఇటు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతూనే తన కుటుంబం, పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. సమయం దొరినప్పుడల్లా భార్య నమ్రత, పిల్లలు సితార, గౌతమ్ లతో కలిసి హాలీడే ట్రిప్స్ కూడా వేస్తుంటారు. అలాగే ఎప్పటికప్పుడు విడుదలైన తన సినిమాలను కుటుంబంతో కలిసి వీక్షిస్తుంటారు మహేష్. ఈ నేపథ్యంలో ఇటీవలే విడుదలైన మహేష్ బాబు లేటెస్ట్ మూవీ 'మహర్షి' విషయంలో తన కొడుకు, కూతురు ఎలా రియాక్ట్ అయ్యారో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మహేష్ పేర్కొన్నారు.

సితార భావోద్వేగం

సితార భావోద్వేగం

మహర్షి సినిమా చూడగానే కూతురు సితార భావోద్వేగానికి గురైందని మహేష్ చెప్పారు. సితార ఇప్పుడు చాలా ఎదిగిపోయిందని, తనకు అన్నీ అర్ధమయ్యే స్టేజ్ వచ్చేసిందని మహేష్ అన్నాడు. మహర్షి చూసిన సితార అందులోని మెసేజ్ అర్థం చేసుకొని భావోద్వేగంతో కన్నీరు పెట్టుకుందని మహేష్ చెప్పుకొచ్చారు.

గౌతమ్ రియాక్షన్

గౌతమ్ రియాక్షన్

సితారతో పాటు గౌతమ్‌కి కూడా మహర్షి బాగా నచ్చిందని మహేష్ బాబు పేర్కొన్నారు. మహర్షి చూడగానే గౌతమ్ తనకు హై ఫై ఇచ్చారని ఈ సందర్బంగా ఆయన చెప్పారు. మహర్షి సినిమా పట్ల తన కొడుకు, కూతురు చాలా ఆనందంగా ఉన్నారని మహేష్ తెలిపారు.

అప్పుడు వేరు ఇప్పుడు వేరు

అప్పుడు వేరు ఇప్పుడు వేరు

తాను రెండేళ్ల క్రిందటి మహేష్ బాబుని కానని ఆయన చెప్పడం విశేషం. ‘‘రెండేళ్లకు ముందు మహేష్ వేరు, ఇవాళ మీ ముందు ఉన్న మహేష్ వేరు. నా మూలాలతో కనెక్ట్‌ అవడానికి ఈ సినిమా చాలా తోడ్పడింది. ఇక నుంచి ఏడాదికి కనీసం ఒక్కసారైనా కుటుంబంతో కలిసి పల్లెటూరికి వెళ్లాలి అనుకుంటున్నా'' అని మహేష్ బాబు అన్నారు.

మహర్షి మూవీపై ఇప్పటికే పలువురి స్పందన

మహర్షి మూవీపై ఇప్పటికే పలువురి స్పందన

మహేష్ 25 వ సినిమాగా వచ్చిన మహర్షి చిత్రానికి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కాయి. పలువురు ప్రముఖులు ఈ సినిమాలో పేర్కొన్న సామాజిక అంశాల పట్ల రియాక్ట్ అవుతూ మహర్షి టీమ్ ని అభినందించారు. వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే 150 కోట్లకు పైగా రాబట్టి మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్‌గా దూసుకుపోతోంది. చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటించగా.. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X