మహేష్ సోదరి క్రేజీ ప్లానింగ్.. నానితో సినిమా!
నేచురల్ స్టార్ నాని 2019లో క్రేజీ చిత్రాలని లైన్ లో పెడుతున్నాడు. 2018 నానికి అంతగా కలిసిరాలేదు. ప్రస్తుతం నాని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం క్రికెట్ నేపథ్యంలో సాగుతుంది. నాని క్రికెటర్ పాత్రలో నటిస్తున్నాడు. ఏప్రిల్ లో జెర్సీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు. జెర్సీ విడుదలైన వెంటనే నాని విక్రమ్ కుమార్ దర్శత్వంలో చిత్రానికి సిద్ధం అవుతాడు.
ఇప్పటికే విక్రమ్ కుమార్, నాని చిత్రానికి అధికారిక ప్రకటన వచ్చింది. ఈ చిత్రం తర్వాత నానితో సినిమా చేసేందుకు పలువురు నిర్మాతలు, దర్శకులు వేచి చూస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నానితో వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి ఓ చిత్రాన్ని చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో ఆసక్తికర అంశం ఏంటంటే సూపర్ స్టార్ మహేష్ సోదరి మంజుల నాని హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఆమె నాని సినిమా కోసం ఓ దర్శకుడికి అడ్వాన్స్ ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇంత బిజీ షెడ్యూల్ లో నాని ఎవరికి ముందుగా ప్రాధాన్యత ఇస్తాడో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. జెర్సీ చిత్రంలో నానికి జోడిగా శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తోంది. అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











