twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనిల్ రావిపూడి ఇంట్లోకి వారసుడొచ్చాడు.. మహేష్ బాబు స్పెషల్ విషెస్

    |

    ఒకవైపు తాను దర్శకత్వం వహించిన బిగ్గెస్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మరోవైపు తండ్రిగా ప్రమోషన్ ఇలా రెండు సంతోషకరమైన వార్తలతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు అనిల్ రావిపూడి. మీడియం రేంజ్ సినిమాలు తీస్తూ.. అపజయాలు లేని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు అనిల్. గతేడాది వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో చేసిన ఎఫ్2 ఘన విజయాన్ని సాధించడంతో సూపర్ స్టార్‌ను డైరెక్ట్ చేసే చాన్స్ కొట్టేశాడు.

    తండ్రిగా ప్రమోషన్..

    తండ్రిగా ప్రమోషన్..

    బిడ్డొచ్చిన వేళా విశేషం అంటారు! ఆ రకంగా చూస్తే సరిలేరు దర్శకుడు అనీల్ రావిపూడికి అన్ని రకాలా కలిసొచ్చిందనే తాజా సన్నివేశం చెబుతోంది. ఓవైపు తన కెరీర్ ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్ `సరిలేరు నీకెవ్వరు` సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వస్తోంది. ఈలోగానే డబుల్ జాక్ పాట్ తగిలింది. అనీల్ వైఫ్ భార్గవి పండంటి బిడ్డకు జన్మనిచ్చిందనే వార్త ఒక్క అనిల్ రావిపూడికే కాదు సరిలేరు టీమ్‌ మొత్తానికి ఆనందకరమైన విషయంగా మారింది.

    శుభసూచికంగానే అంటూ..

    అనిల్ రావిపూడి ఓ కుమారుడు జన్మించడం, సమస్యలన్నీ సమసిపోయి సరిలేరు విడుదలకు రూట్ క్లియర్ అవ్వడం, నేడు ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండటం వంటివి చూస్తే అన్ని శుభ సూచికలే అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ మేరకు అనిల్ రావిపూడికి శుభాకాంక్షలు వెల్లువల వస్తున్నాయి.

    ప్రత్యేకంగా మహేష్ విషెస్..

    ప్రత్యేకంగా మహేష్ విషెస్..

    మా డైరెక్టర్ అనిల్ రావిపూడికి కుమారుడు జన్మించాడు.. కంగ్రాట్స్.. బుడ్డోడికి నా ఆశీస్సులు.. షేన్ ఆన్ బ్రదర్ అంటూ మహేష్ ట్వీట్ చేశాడు. అనీల్ రావిపూడి- భార్గవి జంటకు ఇప్పటికే కూతురు ఉంది. ఇప్పుడు రెండో సంతానంగా కుమారుడు జన్మించాడు. అందుకు చాలా సంతోషంలో ఉందీ జంట. హైదరాబాద్ రెయిన్ బో ఆస్పత్రిలో భార్గవి బిడ్డకు జన్మనిచ్చారని తెలుస్తోంది.

    ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్..

    ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్..

    ఇక నేటి సాయంత్రం జరగబోయే మెగా సూపర్ ఈవెంట్‌కి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ మళ్లింపులు కూడా ఏర్పాట్లు చేశారు. ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

    English summary
    Mahesh Special Wishes For Anil ravipudi Blessed With Baby Boy. It’s a baby boy for my director AnilRavipudi, Congratulations to the proud parents...Loads of love & blessing to the lil one. Shine on brother .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X