నా 20 ఏళ్ల కెరియర్‌లో ఇంత రియాక్షన్ ఎప్పుడూ చూడలేదు.. మహేష్ ఎమోషనల్ మూమెంట్స్

తెలుగు ప్రేక్షకులకు మూడు రోజుల ముందుగానే సంక్రాంతి పండగ తీసుకొచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు' జనవరి 11న విడుదలై అన్నివర్గాల ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. తొలి షో ద్వారానే సక్సెస్ టాక్ తెచ్చుకొని రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. దీంతో ఆనందంగా ఉన్న చిత్రయూనిట్ ఆదివారం రాత్రి థాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ వేదికపై మహేష్ బాబు మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. వివరాల్లోకి పోతే..

ఆకట్టుకున్న మహేష్ స్పీచ్..

ఆకట్టుకున్న మహేష్ స్పీచ్..

హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ థాంక్స్ మీట్‌లో మహేష్ బాబు, రష్మిక మందన్న, విజయశాంతి, అనిల్ రావిపూడి సహా చిత్రయూనిట్ అంతా పాల్గొంది. ఈ మేరకు చిత్రయూనిట్ అందరినీ ఉద్దేశిస్తూ మాట్లాడిన మహేష్.. తన స్పీచ్‌తో ఆకట్టుకున్నారు. యూనిట్ సభ్యులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు.

మైండ్ బ్లాక్ ఎక్స్‌పీరియన్స్

మైండ్ బ్లాక్ ఎక్స్‌పీరియన్స్

జనవరి 11న ముందుగానే సంక్రాంతి పండుగను ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు సిన్సియర్ థాంక్స్ అన్నారు మహేష్. ఇవాళ ఉదయం నిర్మాతలతో కూర్చుని ఈ సినిమా తొలిరోజు కలెక్షన్స్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యామని పేర్కొన్నారు. ఇది తనకు మిరాకిల్ అండ్ మైండ్ బ్లాక్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పుకొచ్చారు.

విజయశాంతిపై మహేష్ కామెంట్స్

విజయశాంతిపై మహేష్ కామెంట్స్

'సరిలేరు నీకెవ్వరు' సినిమా విజయంలో కీలకపాత్ర పోషించిన నా టెక్నీషియన్స్‌కి పెద్ద థాంక్స్ అని మహేష్ అన్నారు. ''నేను ఎప్పుడైనా నా సినిమాను నా పిల్లలతో కలిసి చూస్తా. అది నా సెంటిమెంట్. వాళ్ళతో కలిసి చూస్తున్నప్పుడు విజయశాంతిగారి నటనను చూసి.. ఆమె తప్ప ఆ పాత్రను ఎవరూ చేయలేరని చెప్పుకున్నాం'' అని తెలిపారు మహేష్.

గర్వంగా ఫీల్ అవుతున్నా

గర్వంగా ఫీల్ అవుతున్నా

అలాగే ఫైట్ మాస్టర్స్ రామ్ లక్షణ్ గురించి మాట్లాడుతూ వాళ్ళు తనకెంతో నచ్చుతారని మహేష్ పేర్కొన్నారు. వాళ్లు ఎప్పుడూ ఆడియన్స్‌లానే ఉంటారు తప్ప టెక్నీషన్స్ అని ఫీల్ కారని అన్నారు. దూకుడు తరువాత తాను చేసిన సినిమాలు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు ''శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి'' చిత్రాలను చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని మహేష్ చెప్పారు.

థ్రిల్ చాలా కొత్తగా ఉంది.. నో ప్రాబ్లమ్ అన్నారు

థ్రిల్ చాలా కొత్తగా ఉంది.. నో ప్రాబ్లమ్ అన్నారు

సరిలేరు నీకెవ్వరు సినిమా కథను F2 సినిమా అప్పుడు అనిల్ రావిపూడి చెప్పారని, ఆ సమయంలో చాలా థ్రిల్ ఫీల్ అయ్యానని మహేష్ తెలిపారు. అయితే సంవత్సరం తరువాత చేద్దాం సార్.. అని చెప్పా అని, ఆయన కూడా నో ప్రాబ్లమ్.. నేను ఇంకో సినిమా చేస్తున్నా అన్నారని తెలిపారు. నిన్నటి నుండి తాను ఫీల్ అయిన థ్రిల్ చాలా కొత్తగా ఉందని మహేష్ చెప్పారు.

Recommended Video

Mahesh Babu Ultimate Sense Of Humour
ఫుల్ క్రెడిట్ అతనికే.. మహేష్ ఎమోషనల్ వర్డ్స్

ఫుల్ క్రెడిట్ అతనికే.. మహేష్ ఎమోషనల్ వర్డ్స్

సరిలేరు నీకెవ్వరులో తన పర్ఫామెన్స్‌కి ఆడియన్స్ నుండి వస్తున్న రెస్పాన్స్ ఫుల్ క్రెడిట్ అనిల్ రావిపూడిదే అన్నారు మహేష్. ''దేవి శ్రీ ప్రసాద్ నా ఫేవరేట్. చాలా సార్లు ఈ విషయం చెప్పాను. దేవీ శ్రీ మ్యూజిక్ ఇస్తున్నదంటే నేను ధీమాగా ఉంటా. ఒక మైండ్ బ్లాక్ సాంగ్ ను కంపోజ్ చేసి పెద్ద ప్రయోగం చేశారు. ఒక పెద్ద బ్లాక్‌బస్టర్ చిత్రానికి ఎంత రెస్పాన్స్ వస్తుందో.. అంతే రియాక్షన్ వచ్చింది ఈ పాటకి. రియాక్షన్ నా 20 ఏళ్ల కెరియర్‌లో ఏ సినిమాకు రాలేదు. ఒక్క మైండ్ బ్లాక్ సాంగ్‌కి వచ్చింది. చాలా ఆనందంగా ఉంది'' అన్నారు మహేష్ బాబు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X