twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Hunt సుధీర్ బాబు డేరింగ్ అటెంప్ట్.. ఏ హీరో ఇలాంటి సినిమా చేయరు.. హ్యాట్సాఫ్.. మహేష్

    |

    నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత వీ ఆనంద ప్రసాద్ నిర్మించిన చిత్రం హంట్. సీనియర్ హీరో శ్రీకాంత్, ప్రేమిస్తే ఫేమ్ భరత్ నివాస్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మహేష్‌ సూరపనేని దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26వ తేదీ గురువారం థియేటర్లలో విడుదలైంది. విభిన్నమైన పాయింట్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో రూపొందిన సినిమాకు మిశ్రమ స్పందనతోపాటు క్రిటిక్స్ ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమాకు వస్తున్న రెస్సాన్ పంచుకొనేందుకు చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా సుధీర్ బాబు, ప్రేమిస్తే భరత్, దర్శకుడు మహేష్, సినిమాటోగ్రాఫర్ అరుల్ విన్సెంట్ మాట్లాడుతూ..

    హంట్ మూవీకి మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. హంట్ మూవీ ప్రారంభించినప్పుడు ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని భయపడ్డాం. ఫ్యాన్స్ కానీ, రెగ్యులర్ కంటెంట్ చూసే వాళ్ళు గానీ ఏమంటారో అనుకున్నాం. ప్రేక్షకులు అందరూ సెకండాఫ్‌లో 30 నిమిషాలు గ్రిప్పింగ్‌గా ఉందని చెబుతున్నారు. శని, ఆది వారాలు తర్వాత ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందనే విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తాం. సోషల్ మీడియాలో చాలా మంది సినిమాను అప్రిషియేట్ చేస్తూ పోస్టులు చేశారు. ఆడియన్స్ చాలా మంది వ్యక్తిగతంగా మెసేజ్‌లు చేశారు. వాళ్ళందరికీ థాంక్స్. ఇది డిఫరెంట్ ఫిల్మ్. ఒక్కటి చెబుతా... నేను సాధారణంగా రెగ్యులర్ సినిమాలు చేయను. ఇప్పటి వరకు చేసినవి అన్నీ డిఫరెంట్ సినిమాలే. ఈ సినిమా కూడా చాలా డిఫరెంట్ సినిమా. థియేటర్లలో సినిమా చూడండి అని అన్నారు.

     Mahesh Surapaneni praises appreciates Sudheer Babus daring attempt in Hunt

    దర్శకుడు మహేష్ మాట్లాడుతూ ''జనవరి 26న మా సినిమా 'హంట్' విడుదలైంది. క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ చాలా బావుంది. హంట్ సినిమా డేరింగ్ అటెంప్ట్ అని సుధీర్ బాబును మెచ్చుకొంటూ ఆడియన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. హీరో సుధీర్ బాబు ధైర్యంగా ఆ రోల్ చేశారు. 75 శాతం మంది అలాంటి రోల్ చేసినందుకు మెచ్చుకుంటున్నారు. నేను ఎప్పటికీ గర్వపడే సినిమా. తెలుగులో ఇలాంటి సినిమా చేయడం తొలిసారి. మా సినిమాలో నటించినందుకు ఆయనకు థాంక్స్. సుధీర్ బాబు హ్యాట్సాఫ్. కమర్షియల్ స్పేస్‌లో మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేసే ఏ హీరో కూడా ఇటువంటి క్యారెక్టర్ చేయరు. ప్రేక్షకులకు కొత్తదనం ఇవ్వాలనే తపన ఎంతో ఉంటే తప్పితే చేయరు. ఈ సక్సెస్ క్రెడిట్ ఆయనదే. భవ్య క్రియేషన్స్ ఆనంద ప్రసాద్ గారు, రవి గారు కూడా ప్రేక్షకులకు డిఫరెంట్ సినిమా ప్రేక్షకులకు అందించాలని మాకు ఎంతో అండగా నిలబడ్డారు. ఇటువంటి సినిమా చూసే అవకాశం అరుదుగా వస్తుంది. థియేటర్లకు వచ్చి సినిమా చూడండి. మిమ్మల్ని డిజప్పాయింట్ చేయం. థాంక్యూ ఆల్ అని అన్నారు.

    భరత్ మాట్లాడుతూ ''తెలుగు ప్రేక్షకుల ముందుకు స్ట్రెయిట్ సినిమాతో రావడానికి కొన్నేళ్ళు టైమ్ తీసుకున్నా... మంచి సినిమా చేశా. సరైన సినిమా చేశా. కంటెంట్ సినిమాల కోసం చూసే ప్రేక్షకులకు సరైన చిత్రమిది. కమర్షియల్ వేల్యూస్ తో సినిమా తీశాం. మహేష్ కెరీర్ లో ఇదొక మంచి సినిమా. సుధీర్ బాబు కొత్తగా ట్రై చేశారు. ఈ సినిమాలో నేను ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన భవ్య క్రియేషన్స్ సంస్థకు థాంక్స్'' అని అన్నారు.

     Mahesh Surapaneni praises appreciates Sudheer Babus daring attempt in Hunt

    సినిమాటోగ్రాఫర్ అరుల్ విన్సెంట్ మాట్లాడుతూ.. సినిమాకు లభిస్తున్న స్పందన పట్ల మేం చాలా సంతోషంగా ఉన్నాం. కొత్తది అటెంప్ట్ చేయడం నాకు చాలా ఇష్టం. పలాస తర్వాత తెలుగులో నేను చేసిన చిత్రమిది. సుధీర్ బాబు, శ్రీకాంత్ గారు, భరత్... ముగ్గురు హీరోలు అద్భుతంగా నటించారు. సుధీర్ బాబు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టారు. సినిమాలో హీరోయిన్ లేదనే ఫీలింగ్ ఎవరికీ ఉండదు. రెస్పాన్స్ బావుంది. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూస్తున్నారు. అప్రిషియేట్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది రావాలని ఆశిస్తున్నాను'' అని అన్నారు.

    English summary
    Nitro star Sudheer Babu's Hunt movie released on January 26th. This movie getting good response from Critics. In this occassion, Unit celebrated success meet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X