మహేశ్.. అభిమానులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ చిత్రాన్ని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. ఇందులో మహేశ్ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా, ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. ఇందులో మహేశ్ ఆర్మీ మేజర్ పాత్రను చేస్తున్నాడు.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. అందుకోసం నిరంతరాయంగా షూటింగ్ జరుపుతోంది చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదే.. ఈ సినిమా టీజర్ విడుదల అప్‌డేట్. ఆగస్టు 9 (శుక్రవారం) మహేశ్ బాబు పుట్టిన రోజు. దీనిని పురస్కరించుకుని 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ విడుదల చేయబోతున్నారని ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కట్ కూడా అయిపోయిందని అంటున్నారు.

దీనిపై మరో వాదన కూడా వినిపిస్తోంది. షూటింగ్ మేజర్ పార్ట్ పూర్తవని కారణంగా టైటిల్‌కు సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదల చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మహేశ్ బాబు మేజర్ గెటప్‌లో ఉన్న పిక్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కాబట్టి.. ఏదైనా కొత్తగా విడుదల చేయాలని వాళ్లు భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు, దీనికి సంబంధించిన ప్రకటన ఏమీ చేయకుండానే డైరెక్టుగా సోషల్ మీడియాలో వదులుతారని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే సూపర్ స్టార్ అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











