మహేష్, రాజమౌళి సినిమా ఇదే.. ఫ్యాన్ మేడ్ పోస్టర్ కెవ్వుకేక
సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా వస్తే చూడాలని కలలు కంటున్న అభిమానులకు సంతోషాన్ని కలిగించే తీపి వార్త అందింది. ఇటీవల ప్రముఖ టెలివిజన్ ఛానెల్స్‌తో మాట్లాడిన రాజమౌళి తన భవిష్యత్ సినిమాలపై క్లారిటీ ఇస్తూ RRR సినిమా తర్వాత మహేష్‌బాబుతో సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చేశాడు.
తనకు ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణతో సినిమా చేయాల్సిన ఒప్పందం ఉంది. ఆ క్రమంలోనే RRR తర్వాత మహేష్‌బాబుతో సినిమా చేస్తాను అని మీడియా ముఖంగా బ్రేకింగ్ న్యూస్ ఇచ్చారు. అలా రాజమౌళి ప్రకటించారో లేదో మహేష్ బాబు ఫ్యాన్స్ తమ ప్రతిభకు సానపెట్టారు. వెంటనే ఫ్యాన్ మేడ్ పోస్టర్లతో సోషల్ మీడియాను దడదడలాడించేస్తున్నారు.

రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వచ్చే సినిమాపై ఫ్యాన్స్‌లో ఊహగానాలు అంచనాలు మొదలయ్యాయి. ఓ అభిమాని తన ఊహలకు అనుగుణంగా రూపొందించిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై ఎస్ గోపాల్ రెడ్డి సమర్పణలో గూఢచారి 116 అనే టైటిల్‌తో పోస్టరును డిజైన్ చేశారు.
దర్శకత్వం: రాజమౌళి
నిర్మాతలు: డాక్టర్ కేఎల్ నారాయణ, ఎస్ గోపాల్ రెడ్డి
కథ: వీ విజయేంద్ర ప్రసాద్
కెమెరా: కేకే సెంథిల్ కుమార్
సంగీతం: ఎంఎం కీరవాణి అంటూ సాంకేతిక నిపుణులను కూడా డిసైడ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకొంటున్నది.


Click it and Unblock the Notifications











