పవన్, బన్నీ మధ్య చిచ్చు.. అసలు విషయాన్ని బయటకి రాకుండా తొక్కేసారా?
గత కొన్నాళ్ల నుంచి టాలీవుడ్ సినిమా దగ్గర బాగా వైరల్ గా హాట్ టాపిక్ గా మారిన కొన్ని అంశాల్లో మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ వార్ కూడా ఒకటి అని చెప్పాలి. ఈసారి ఏపీలో ఎన్నికల్లో మెగా కుటుంబం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ఎన్నికల్లో నిలిచేసరికి మెగా కుటుంబం అంతా పవన్ గెలుపు కోసం కదిలింది. కానీ అల్లు ఫ్యామిలీ నుంచి కొందరు సన్నిహితులు పవన్ తో కలిసి పని చేశారు కానీ మెయిన్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పని మాత్రం అందరికీ షాకిచ్చి పెద్ద కాంట్రవర్సీకే దారి తీసింది.
కాగా అక్కడ నుంచి అల్లు వర్సెస్ మెగా వార్ గా మారిపోగా మధ్యలో అల్లు అర్జున్ తండ్రి ప్రముఖ నిర్మాత అయినటువంటి అల్లు అరవింద్ ఏదో సెటిల్ చేసే ప్రయత్నం చేశారు. ఇక పోతే నెక్స్ట్ మెగా బ్రదర్ నాగబాబు కూడా కొంచెం పాజిటివ్ గా అల్లు అర్జున్ విషయంలో స్పందించడంతో అంతా సెట్ అయ్యింది.. అనుకునే లోపే ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ చిచ్చు రేపాయి.

ఒకప్పుడు హీరోలు అంటే పర్యావరణాన్ని పరిరక్షించే వారిలా ఉండే వారు కానీ ఇప్పుడు స్మగ్లర్లు, చెట్లు నరికేవాళ్ళని హీరోలుగా చూపిస్తూ హీరోయిజం చేస్తున్నారు అంటూ చేసిన కామెంట్స్ నేరుగా అల్లు అర్జున్ కే తగిలాయి అని అందరికీ పొక్కేసింది. అసలు పవన్ ఎక్కడా కూడా అల్లు అర్జున్ అని కానీ తన పాన్ ఇండియా సినిమా పుష్ప అని ఎక్కడా మెన్షన్ చేసింది లేదు.
అయినా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హీట్ మాత్రం మాములుగా లేదు. కాగా ఇక్కడ అసలు విషయం మరొకటి ఉంది. పవన్ కళ్యాణ్ ఒక్క ఉదాహరణగా సినిమాల విషయంలో చెప్పారు. "నేను కూడా ఒక సినిమా వాడినే ఒకోసారి ఇలాంటి సినిమాలు చేసినప్పుడు నాకు కూడా ఇబ్బంది గానే అనిపిస్తుంది. సినిమా అనేది డిఫరెంట్ కానీ కల్చరల్ గా మనం ఎలా చూపించాం అనేది ముఖ్యం" అంటూ కామెంట్స్ చేశారు.
దీనితో సినిమా అనేది అప్పటికి నుంచి ఇప్పటికి ఇలా రూపాంతరం చెందింది తప్పితే తప్పును ప్రోత్సహించమని ఎక్కడా చెప్పలేదు అంటూ నేను ఒక సినిమా వాడిగా కూడా చెబుతున్నాను అని తెలిపారు. కానీ ఆశ్చర్యంగా ఈ బిట్ ఎక్కడా వైరల్ గా మారడం లేదు కానీ స్మగ్లర్లు, పర్యావరణాన్ని భక్షించేవారిని హీరోలుగా చూపిస్తున్నారు అనే ఒక్క ముక్కని కన్వీనెంట్ గా కట్ చేసి కొందరు వైరల్ చేస్తున్నారని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు.
మొత్తం వీడియో చూసి అప్పుడు మాట్లాడాలి అంటూ సదరు అల్లు అర్జున్ అభిమానులకి కూడా చెబుతున్నారు. అలాంటి నెగిటివ్ ట్రాప్ లో పడొద్దని కూడా వారు చెబుతున్నారు. అయితే పవన్ విషయంలో ఇలా వీడియోస్ కట్ చేసి తప్పుడు ప్రచారాలు చేయడం సోషల్ మీడియాలో కొత్తేమి కాదు. పవన్ తప్పు మాట్లాడాడు అంటూ కొని వీడియోస్ వైరల్ చూస్తే ఫుల్ వీడియో తీసుకొచ్చి పవన్ అభిమానులు ఇచ్చే సమాధానాలు ఇంకొక ఎత్తుగా వస్తూనే ఉంటాయి.


Click it and Unblock the Notifications











