వరస కలుపుతూ పెళ్ళికి ముందు నాగ చైతన్యపై ఆ హీరోయిన్ పోస్ట్ వైరల్..
సినీ సెలెబ్స్, హీరో హీరోయిన్స్ లేదా ఇతర మేల్ అండ్ ఫీమేల్ ఆర్టిస్ట్ లు కొందరు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటారని అందరికీ తెలిసిందే. కొందరు పెళ్లిళ్లు చేసుకుంటే ఇంకొందరు డేటింగ్స్ అంటూ లివిన్ రిలేషన్ లో కూడా ఉంటారు. అలా ప్రేమ నుంచి పెళ్లి వరకు వచ్చిన సినీ తారలు మాత్రం చాలా తక్కువ మందే ఉంటారని చెప్పాలి.
అలాంటి స్టార్ కపుల్ లో ఒకప్పుడు ఎంతోమందికి మోస్ట్ ఫెవరెట్ జంట ఎవరైనా ఉన్నారు అంటే వారు ఖచ్చితంగా అక్కినేని నాగ చైతన్య అలాగే టాప్ హీరోయిన్ సమంతల జోడి అనే చెప్పాలి. ఈ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్నాళ్లు ఎంతో హ్యాపీ లైఫ్ ని లీడ్ చేశారు . కానీ ఏమైందో తెలీదు కానీ సడెన్ గా విడాకులు అంటూ అందరి హృదయాలు ముక్కలు చేశారు.

ఇక ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటూ మూవ్ ఆన్ కాగా సమంత సినిమాలు, వెబ్ సిరీస్ లు అని ఫుల్ బిజీగా అయ్యిపోయింది. నాగ చైతన్య కూడా సినిమాలు సహా వెబ్ సిరీస్ తో ఓటిటి ఎంట్రీ కూడా ఇచ్చాడు. ఈ తర్వాత మళ్ళీ చైతు షాకింగ్ గా రెండో పెళ్లి వార్తని అనౌన్స్ చేసి ట్విస్ట్ ఇచ్చాడు. టాలెంటెడ్ నటి శోభిత ధూళిపాళని తాను పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ప్రకటించి కొత్త జీవితానికి నాంది పలికాడు నాగచైతన్య.
ఈ ఎపిసోడ్ తర్వాత మళ్ళీ సమంత విషయంలో అక్కినేని నాగార్జున అండ్ ఫ్యామిలీని లాగుతూ తెలంగాణ రాజకీయ నాయకులు షాకింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. ఇలా ఎట్టకేలకి అన్నీ దాటుకొని ఇపుడు ఫ్యామిలీ అంతా పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే ఓ యంగ్ హీరోయిన్ నాగ చైతన్యని వరుస పెట్టి పిలుస్తూ క్రేజీ పోస్ట్ పెట్టడం సోషల్ మీడియాలో కొంచెం అటెన్షన్ ని తెచ్చుకుంది.
కాగా ఆ హీరోయిన్ ఎవరో కాదు అదే నాగ చైతన్య, సమంత కాంబినేషన్ లో వచ్చిన భారీ హిట్ చిత్రం "మజిలీ" లో రెండో హీరోయిన్ గా నటించిన నార్త్ బ్యూటీ దివ్యాన్షా కౌశిక్. ఈమె నాగ చైతన్యని మాయా అంటూ ఆప్యాయంగా పిలుస్తూ తమ సినిమా నుంచి ఓ పిక్ పెట్టి మరీ పోస్ట్ చేసింది. అయితే ఇక్కడ అంత కంగారు పడాల్సిన పని లేదు ఎందుకంటే నాగ చైతన్య పుట్టినరోజుకి ఈ రకంగా ఆమె పిక్ పెట్టి విష్ చేసింది.
అయితే సరిగ్గా పెళ్లి పనుల్లో ఉన్న సమయంలో నాగ చైతన్యని పూర్ణా మాయా అంటూ పిలుస్తూ పోస్ట్ చేయడం ఏంటా అనే ప్రశ్నలు కూడా కొందరు ఫన్నీగా వేసుకుంటున్నారు. అయితే ఈమె పెట్టిన పోస్ట్ మాత్రం వెంటనే మంచి అటెన్షన్ ని తెచ్చుకొని వేల కొద్దీ లైక్స్ ని అందుకుంది. ఇక ఈ యంగ్ హీరోయిన్ రీసెంట్ గానే నిఖిల్ నటించిన అపుడో ఇపుడో ఎపుడో అనే సినిమాలో నెగిటివ్ రోల్ చేసి పలకరించింది.


Click it and Unblock the Notifications











