twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చైతు-సమంత ‘మజిలీ’ దక్కించుకున్న అమేజాన్ ప్రైమ్, ఎంతంటే..?

    |

    అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత వివాహం తర్వాత క‌లిసి న‌టిస్తున్న తొలి చిత్రం 'మ‌జిలీ'కి ట్రేడ్ సర్కిల్‌లో మంచి డిమాండ్ ఏర్పడింది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యాన‌ర్ పై సాహు గ‌ర‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమేజాన్ ప్రైమ్ రూ. 3.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 4 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం.

    Majili’s digital rights acquired by Amazon Prime

    మరో వైపు థియేట్రికల్ బిజినెస్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో పలు ఏరియాల నుంచి డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నాయట. త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. దేర్ ఈజ్ ల‌వ్.. దేర్ ఈజ్ పెయిన్ అనే ట్యాగ్ లైన్‌తో వ‌స్తున్న ఈ మూవీ వైజాగ్ నేప‌థ్యంలో సాగుతుంది. ఇందులో చైతూ క్రికెటర్‌గా కనిపించబోతున్నారు.

    రావు ర‌మేష్, పోసాని కృష్ణ‌ముర‌ళి, సుబ్బ‌రాజ్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా.. విష్ణు వ‌ర్మ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యాన‌ర్ పై సాహు గ‌ర‌పాటి, హ‌రీష్ పెద్ది మ‌జిలి సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం: శివ నిర్వాన‌, సంగీతం: గోపీ సుంద‌ర్, సినిమాటోగ్ర‌ఫీ: విష్ణు శ‌ర్మ, ఆర్ట్ డైరెక్ట‌ర్: సాహి సురేష్, ఎడిట‌ర్: ప‌్ర‌వీణ్ పూడి, యాక్ష‌న్: వెంక‌ట్

    English summary
    As per our sources, Majili’s digital streaming rights have been acquired by Amazon Prime for around Rs 3.5 crore. Also, the Hindi dubbing rights were sold for another Rs 4 crore approximately.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X