మామాఅల్లుళ్ళ స్టైలిష్ వీడియో బయటపెట్టిన దగ్గుబాటి రానా

రియల్ లైఫ్ మామా అల్లుళ్లు విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటిస్తున్న సినిమా 'వెంకీ మామ'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, నాగ చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు డైరెక్టర్ బాబీ (కె ఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకింగ్‌ వీడియో విడుదలైంది. దర్శకుడు కేఎస్‌ రవీంద్ర(బాబీ) పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియోను విడుదల చేశారు. మేకింగ్ వీడియోను హీరో రానా తన ట్విటర్‌ లో పోస్ట్‌ చేస్తూ బాబీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియోలో వెంకీ,నాగ్ చైతన్య స్టైలిష్ లుక్స్ చూస్తుంటే.. వెండితెరపై వారి హంగామా మామూలుగా ఉండదని తెలుస్తోంది. ఈ మల్టీస్టారర్ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి క్రేజ్ నెలకొంది.

Making Video From Venky Mama

ఇక ఇటీవలే వెంకీ మామ కథాంశానికి సంబందించిన ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ సినిమాలో నాగ చైతన్య బాగా కష్టాలొస్తాయట. ఆ కష్టాలన్నీ తన మామ వెంకటేష్ వల్లనే ఉత్పన్నమవుతాయట. అయితే వాటి నుంచి బయటపడే క్రమంలో నాగ చైతన్య జ్యోతిష్యుల చుట్టూ తిరగాల్సి వస్తుందట. ఈ నేపథ్యంలో ఆసక్తికర సన్నివేశాలతో సినిమా సాగిపోతుందని అంటున్నారు. ఆడియన్స్‌ని ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేసే కామెడీ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. చిత్రంలో వెంకటేష్, నాగ చైతన్య మామ అల్లుళ్లుగానే నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X