అబ్బురపరుస్తున 2.0 మేకింగ్ వీడియో.. గ్రాఫిక్స్‌తో ఉక్కిరిబిక్కిరి!

దర్శకుడు శంకర్ రూపొందించిన అద్భుత గ్రాఫిక్స్ మాయాజాలం 2.0 చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. నవంబర్ నెలాఖరులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి శంకర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. 2.0 చిత్ర ప్రమోషన్స్ వేగం పెరిగింది.

ఇటీవలే విడుదల చేసిన టీజర్ లో ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ఎలా ఉండబోతున్నాయో శంకర్ శాంపిల్ చూపించాడు. తాజగా ఈ చిత్ర మేకింగ్ వీడియోని విడుదల చేశారు. ప్రపంచ నలుమూలల ప్రఖ్యాతి గాంచిన విఎఫ్ఎక్స్ సంస్థలన్నీ ఈ చిత్రం కోసం పనిచేశాయి. హాలీవుడ్ లో ఆరితేరిన సిబ్బంది ఈ చిత్రం గ్రాఫిక్స్, యాక్షన్ సన్నివేశాల కోసం పనిచేశారు.

మేకింగ్ వీడియోలో చూపిస్తున్న గ్రాఫిక్స్ అబ్బుర పరిచే విధంగా ఉన్నాయి. వేలాదిమంది సాంకేతిక నిపుణుల కష్టాన్ని శంకర్ ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేశారు. 2.0 చిత్రం కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అభిమానులలో ఆసక్తి పెంచేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ చిట్టి రోబోగా, అక్షయ్ కుమార్ మానవాళిని అంతం చేసే సూపర్ విలన్ గా ఈ చిత్రంలో నటిస్తున్నారు.

Making video of super star Rajinikanth 2.0

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X